33.2 C
Hyderabad
Tuesday, May 5, 2026
spot_img

విజయ్ ఆంటోనీ ‘తుఫాన్’ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్

హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “తుఫాన్”. ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. ఈ సంస్థ గతంలో విజయ్ ఆంటోనీ హీరోగా రాఘవన్, హత్య సినిమాలను నిర్మించింది. పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్ లో “తుఫాన్” సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు విజయ్ మిల్టన్. “తుఫాన్” సినిమాను త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురానున్నారు. ఈ రోజు “తుఫాన్” సెకండ్ సింగిల్ ‘వెతికా నేనే నా జాడే’ రిలీజ్ చేశారు.

‘వెతికా నేనే నా జాడే’ పాటకు భాష్యశ్రీ లిరిక్స్ అందించారు. మాష్మి నేహా పాడారు. హరి దఫూషియా సంగీతాన్ని అందించారు. ‘ వెతికా నేనే నా జాడే నిలిచి దారిలో..నా ఒళ్లే వెతికే నేడు కొత్త పేరునే, నాకు నేనై తప్పి పోయా గాలై సాగుతూ..కాలం కరిగిపోయే తీరం చేరుతూ’ అంటూ ఆలోచింపజేసే లిరిక్స్ తో సాగుతుందీ పాట. “తుఫాన్” సినిమాకు ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

నటీనటులు – విజయ్ ఆంటోనీ, శరత్ కుమార్, సత్యరాజ్, డాలీ ధనుంజయ, మేఘా ఆకాష్, మురళీ శర్మ, పృథ్వీ అంబర్, శరణ్య పొన్వన్నన్, తలైవాసల్ విజయ్ తదితరులు

టెక్నికల్ టీమ్

కాస్ట్యూమ్స్ – షిమోనా స్టాలిన్
డిజైనర్ – తండోరా చంద్రు
యాక్షన్ కొరియోగ్రాఫర్ – సుప్రీమ్ సుందర్
ఆర్ట్ డైరెక్టర్ – అరుముగస్వామి
ఎడిటింగ్ – ప్రవీణ్ కేఎల్
మ్యూజిక్ – అచ్చు రాజమణి, విజయ్ ఆంటోనీ
డైలాగ్ రైటర్ – భాష్య శ్రీ
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
నిర్మాతలు – కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా
రచన, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ – విజయ్ మిల్టన్

Latest Articles

విజయ్‌కి టచ్‌లోకి వచ్చిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు

తమిళనాడులో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. అన్నాడీఎంకే పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు టీవీకే అధినేత విజయ్‌తో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే పార్టీ అత్యవసర సమావేశానికి ఎమ్మెల్యేలను పిలిచింది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్