బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ సీనియర్ వి. హనుమంతరావు. తమ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీపై అస్సాంలో కేసు నమోదు చేయడాన్ని తప్పుబట్టారు. స్వాతంత్య్రం గురించి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాటలపై ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. మీకో న్యాయం.. మాకు మరొకటా అని నిలదీశారు. సమాజాన్ని, పిల్లలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌పై కేసు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హోంమంత్రి అమిత్ షాపై కేసు నమోదు చేయాలని వీహెచ్ డిమాండ్ చేశారు.