పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దివంగత రెబల్‌స్టార్ కృష్ణంరాజు జయంతి సందర్భంగా ఆయన ఫ్యామిలీ సభ్యులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భీమవరంలో ఉచిత మెగా షుగర్ వ్యాది చికిత్స శిభిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. మండలి చైర్మన్ మోషేన్‌రాజు, విజయనగరం ఎంపీ అప్పలనాయుడు, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, టీజీ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. ఇండియా డయాబెటిక్ ఫుట్ ఫౌండేషన్, ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు మెమోరియల్ సంయుక్తంగా ఉచిత షుగర్ వ్యాది చికిత్స శిబిరం ఏర్పాటు చేశారు.
షుగర్ వ్యాధి ఉన్న వారికి పాదాల పగుళ్ళు, పుండ్లు, గాయాలు, స్పర్శ కోల్పోయిన వారికి ఈ శిబిరంలో డాక్టర్లు ప్రత్యేక చికిత్స అందించారు. లండన్ నుండి వచ్చిన స్పెషలిస్ట్ డాక్టర్ వేణు కవర్తపు పర్యవేక్షణలో మెడికల్ క్యాంపు జరిగింది. వేలాదిగా వచ్చిన షుగర్ పేషెంట్లు వైద్య సేవలు వినియోగించుకున్నారు. యాభై మంది డాక్టర్లు వైద్య సేవలు అందించారు. కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, వారి కుమార్తెలు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. కృష్ణంరాజు, ప్రభాస్ ఫ్యాన్స్ వైద్య శిబిరంలో పాల్గొని సేవలు అందించారు.