తెలంగాణలో పని చేసే కార్మికుల అభివృద్ధి కోసం మాజీ సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కష్టం వచ్చినప్పుడే నాయకుడి విలువ తెలుస్తుందని చెప్పారు. . తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. కరోనా కష్టకాలంలో వలస కార్మికులను కూడా కేటీఆర్ ఆదుకున్నారని అన్నారు. కార్మికులకు మేలు చేసేందుకు గతంలో కేంద్రంలో కార్మిక శాఖను కేసీఆర్ తీసుకున్నారని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్లపై లాఠీలతో దాడి చేయించిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని విమర్శించారు.