31.2 C
Hyderabad
Thursday, April 17, 2025
spot_img

Medico Preethi | ఆ రూ.50లక్షల కోసమే ప్రీతి చనిపోయిందా?

Medico Preethi | మెడికో ప్రీతి ఆత్మహత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ట్విస్టే ఆమె ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. అదేటంటే తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో ఎవరైనా మెడిసిన్  చదవాలంటే, వారు ముందుగా అడ్మిషన్ బాండ్ మీద కచ్చితంగా సంతకం చేయాల్సి ఉంటుంది. అది కూడా 50లక్షల రూపాయల అగ్రిమెంట్ పేపర్ల మీద విద్యార్థితో పాటు తల్లిదండ్రులు సంతకం పెట్టాలి. అంటే ఏవైనా కారణాల మధ్యలోనే కాలేజీ నుంచి మానివేస్తే యాజమాన్యానికి రూ.50లక్షలు చెల్లించాలన్న మాట. ఇంతకుముందు ఈ అగ్రిమెంట్ విలువ రూ.20లక్షల వరకే చెల్లించాలనే నిబంధన ఉండేది. అయితే ఇటీవల కాలంలో విద్యార్థులు అనేక కారణాలతో మధ్యలో మెడిసన్ మానేస్తున్నారనే కారణంతో ప్రభుత్వం దానిని రూ.50లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ఇదే Medico Preethi పాలిట మృత్యుపాశంగా మారిందా?

ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఎన్ని సమస్యలున్నా కోర్సు మధ్యలో నుంచి వెళ్లిపోవడానికి సాహసించడం లేదని కొంతమంది విద్యార్థులు వాపోతున్నారు. ర్యాగింగ్, వేధింపులు, ఇతరత్రా సమస్యలున్నా చాలా మంది విద్యార్థులు ఏం చేయలేక మనోవేదనతోనే వైద్య విద్య పూర్తిచేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రీతి విషయంలో కూడా ఇలాంటిదే జరిగిందనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. నిందితుడు సైఫ్ వేధింపులు మరి ఎక్కువ కావడంతో ఆమె తల్లిదండ్రులకు చెప్పుకుని భోరున విలపించింది. అయితే వారు కాలేజీ నుంచి వెనక్కి వచ్చేయమన్నా కానీ.. కోర్సు మధ్యలోనే వచ్చేస్తే తన పేరెంట్స్ రూ.50లక్షలు యాజమాన్యానికి చెల్లించాలి కదా? అని ప్రీతి తీవ్ర మనోవేదనకు గురైనట్లు సమాచారం.

పేరెంట్స్ అంత డబ్బులు కట్టలేరని?

ఇటు సీనియర్ల వేధింపులు భరించలేక.. అటు తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టలేక.. ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు చర్చ జరుగుతోంది. దీంతో సీనియర్ల వేధింపులు, ర్యాంగింగ్ పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్స్ వస్తున్నాయి. అలాగే రూ.50లక్షలు చెల్లించేలా ప్రభుత్వం తెచ్చిన కొత్త అడ్మిషన్ అగ్రిమెంట్ నిలిపివేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అలా చేస్తేనే ఇటువంటి దుర్ఘటనలు మరోసారి జరగకుండా ఉంటాయని పేరెంట్స్ చెబుతున్నారు.

Read Also: మెడికో ప్రీతి పేరెంట్స్ కు ఎమ్మెల్సీ కవిత హామీ లేఖ

 

Latest Articles

‘మధురం’ మధురమైన విజయాన్ని అందుకోవాలి: వీవీ వినాయక్

యంగ్ హీరో ఉదయ్ రాజ్, వైష్ణవి సింగ్ జంటగా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై టాలెంటెడ్ డైరెక్టర్ రాజేష్ చికిలే దర్శకత్వంలో అభిరుచి గల నిర్మాత యం.బంగార్రాజు నిర్మించిన చిత్రం మధురం....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్