జర్నలిస్టు సమస్యల కోసం నిరంతరం పోరాడే TUWJ IJU యూనియన్ మూడో మహసభలను ఖమ్మంలో నిర్వహిస్తున్న ట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వ హయాం లో జర్నలిస్టుల సమస్యల సాధన కోసం మహాసభలలో కార్యచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే మహసభలకు ఖమ్మం జిల్లా ఆతిధ్యం ఇవ్వడం సంతోషకర మన్నారు.