చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి న అనంతరం మొదటగా 5 ఫైళ్లపై సంతకాలు చేయడంతో ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ నేతలు సంబురాలు చేసుకు న్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం మొదటి సంతకం డీఎస్సీపై పెట్టారని కొనియాడారు. గత ప్రభుత్వం డీఎస్సీ ప్రకటిస్తామని నమ్మించి నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు.