TSPSC Paper Leak |టీఎస్పిఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. లీకేజీ కేసును సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని కాంగ్రెస్ అనుబంధ సంస్థ NSUI నేత బల్మూరి వెంకట్ వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. రాజకీయ దురుద్దేశంతో పిటిషన్ వేశారని.. సిట్ సక్రమంగానే దర్యాప్తు జరుపుతోందని.. ఇప్పటివరకు తొమ్మిది మందిని అధికారులు అరెస్ట్ చేశారని ప్రభుత్వ తరపున ఏజీ ప్రసాద్ వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం.. లీకేజీ కేసుకు సంబంధించిన స్టేటస్ రిపోర్టును సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ఈ కేసులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను ఏప్రిల్ 11కు వాయిదా వేసింది.
Read Also: ఖలిస్థానీ వేర్పాటువాది అమృత్ పాల్ తప్పించుకోవడంపై హైకోర్టు సీరియస్
Follow us on: Youtube Instagram