సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను ఒక్కటి కూడ నెరవేర్చలేదని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఏదో జరిగిందని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్‌ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి చిల్లర పొలిటికల్ డ్రామా ఆడుతున్నారని ప్రశాంత్ రెడ్డి గ్రహం వ్యక్తం చేశారు. ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ నగరానికి తీసుకువచ్చింది కేటీఆర్ అని చెప్పారు. ఫార్ములా ఈ కార్ రేస్ రద్దు చేసింది రేవంత్ రెడ్డి అని అన్నారు. లొట్టపీసు కేసులో ఏదో దొరకబడదామని ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కేసులో ఏం దొరకలేదని ఎలక్టోరల్ బాండ్లు తెరపైకి తెచ్చారని చెప్పారు. దేశంలో అన్ని పార్టీలకు ఎలక్టోరల్ బాండ్లు వచ్చాయని.. ఫార్ములా ఈ రేస్ నిర్వహించి గ్రీన్ కో కంపెనీ నష్టపోయిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.1,509 కోట్ల రూపాయలు సంపాదించిందని .. కాంగ్రెస్ పార్టీ క్విడ్ ప్రోకో చేసి ఎలక్టోరల్ బాండ్లు తెచ్చుకుందా.. అని ప్రశ్నించారు. కేటీఆర్ చట్ట ప్రకారం ఉన్న అన్ని అవకాశాలను వాడుకుంటారని వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.