అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం చేసినా సంచలనమే. జనంలో జోష్ పెంచడంలో ఏ నాయకుడైనా ట్రంప్ తరువాతనే. తాజాగా ఇటువంటి సంఘటనే జరిగింది. డొనాల్డ్ ట్రంప్ స్వంత రాష్ట్రమైన ఫ్లోరిడాలో తాజాగా ఓ మోటార్ కార్ రేసు ప్రారంభమైంది. దీనినే ది డెటోనా – 500 అంటారు. కాగా ఈ రేస్ ప్రారంభానికి ఏకంగా అధ్యక్షుడు ట్రంప్ తన మోటార్ కేడ్ లో ఉపయోగించే కారు దీ బీస్ట్ ను కూడా పంపారు.
ఇంకేముంది రేసు చూడటానికి వచ్చిన ప్రేక్షకులను ఉత్సాహపరుస్తూ ది బీస్ట్ కారు…రెండు ల్యాప్ ను కూడా పూర్తి చేసింది. కాగా ఆ సమయంలో ట్రంప్ తన మనవరాలు కరోలినాతో కలిసి కారులో ఉన్నట్లు తెలుస్తోంది. ది బీస్ట్ కారు….చక్కర్లతో చూస్తున్నవారిలో ఫుల్ జోష్ వచ్చినట్లు మోటార్ రేస్ నిర్వాహకులు తెలిపారు. అంతేకాదు అధ్యక్షుడి విమానం ఎయిర్ ఫోర్స్ వన్ కూడా ది డెటోనా – 500 రేసు జరుగుతున్న మైదానం చుట్టూ ఓ రౌండ్ వేసింది. కాగా అమెరికాలో ప్రతి ఏడాది ఎన్నో మోటార్ రేసులు జరుగుతుంటాయి. వీటిలో ది డెటోనా – 500 రేస్ అత్యంత ప్రతిష్టాత్మకమైనది. కాగా 2020లో ది డెటోనా – 500 రేసును డొనాల్డ్ ట్రంప్ పత్యక్షంగా చూశారు. రేస్ జరుగుతున్న మైదానానికి ఆయన వచ్చారు.
వాస్తవానికి అమెరికాలో ది బీస్ట్ కారుకు ఒక ప్రత్యేకత ఉంది. అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే కారే….ది బీస్ట్. ఈ కారును కాడిలాక్ వన్, ఫస్ట్ కార్ అని కూడా అంటారు. అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్నవారెవరైనా, బయటకు వెళితే…అక్కడ ది బీస్ట్ కారు అడుగు పెట్టాల్సిందే. ది బీస్ట్ కారుకు అనేక ప్రత్యేకతలున్నాయి. ఈ కారు అద్దాలను సురక్షితంగా తయారు చేశారు. టోటల్ గా బుల్లెట్ ప్రూఫ్ . మొత్తం ఐదు పొరల్లో ఈ అద్దాలను రూపొందించారు. రసాయన, జీవాయుధ దాడులను కూడా ది బీస్ట్ కారు అద్దాలు తట్టుకోగలవు.
ఇక డ్రైవర్ క్యాబిన్ లో జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ ఉంటుంది. కారు ఎక్కడ ఉన్నా, వెంటనే తెలిసిపోతుంది. సాదా సీదా డ్రైవర్లు ఈ కారు నడపలేరు. ఈ కారు నడిపే డ్రైవర్లకు అమెరికా సీక్రెట్ సర్వీస్ తో ముందుగా శిక్షణ ఇప్పిస్తారు. అంతేకాదు సదరు డ్రైవరుకు ప్రతిరోజూ మెడికల్ టెస్టులు చేయిస్తుంటారు. అంతేకాదు కారులో అధ్యక్షుడు కూర్చునే కుర్చీ దగ్గర శాటిలైట్ ఫోన్ ఉంటుంది. దీంతో కారులో ప్రయాణిస్తూనే నేరుగా ఉపాధ్యక్షుడు లేదా పెంటగాన్ అధికారులతో ఫోన్ చేసి మాట్లాడవచ్చు.