2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న రేస్ లో మాజీ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ముందంజలో దూసుకెళ్తున్నారు. ప్రత్యర్థి నిక్కీ హలే సొంత స్టేట్ అయిన సౌత్ కరోలినా లో జరిగిన ప్రిమియర్ లో ట్రంప్ విజయం సాధించి.. ముందడుగు వేశారు. రిపబ్లికన్ సౌత్ కరోలినా ప్రైమరీ ఓటర్ల సమగ్ర సర్వే , ఏపీ ఓట్ కాస్ట్ విశ్లేషణ అనంతరం డొనాల్డ్ ట్రంప్ ను విజేతగా ప్రకటించారు. ఎన్నికలకు ముందు నిర్వహించిన సర్వేలో కూడా హేలీ కంటే ట్రంప్ కు గణనీయమైన ఆధిక్యం లభించింది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం రేస్ లో ట్రంప్ వరుసగా సాధిస్తున్న ప్రైమరీ విజయం నిక్కీ హేలీకి మింగుడుపడలేదు. 2011 నుంచి 2017 వరకు ఐక్యరాజ్యసమితి మాజీ రాయబారి, దక్షిణ కరోలినా గవర్నర్గా పనిచేసిన నిక్కీ హేలీ మున్ముందు కూడా తన ప్రచారాన్ని కొనసాగించాలని నిర్ణయిం చుకున్నారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాబోయే నవంబర్ ఎన్నికలను “జడ్జిమెంట్ డే” గా అభివర్ణించారు. రెండోటర్మ్ ప్రెసిడెంట్ కావాలని కోరుతున్న ప్రస్తుత ప్రెసిడెంట్ బైడన్ ను ఈసారి ఎన్నికల్లో చిత్తు చేయగలనన్న ధీమాను ట్రంప్ వ్యక్తం చేశారు.


