Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

పర్యాటకానికి స్పేస్ లో ప్లేస్

       అంతరిక్ష పర్యాటకం …ఇటీవలికాలంలో ప్రపంచవ్యాప్తంగా హల్‌చల్ చేస్తున్న మాట. సహజంగా పర్యాటకం అంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. అయితే అంతరిక్ష పర్యాటకం అంటే మరింత ఆసక్తి ఉంటుంది. అయితే స్పేస్ టూరిజం అందరికీ అందుబాటులో ఉండదు. కేవలం కోటీశ్వరులకు మాత్రమే ఉంటుంది. అంతరిక్ష పర్యాటకానికి సంబంధించిన ధరలను సామాన్యులు ఏమాత్రం భరించలేరు. కేవలం సంపన్నులు అదికూడా కోటీశ్వరులు మాత్రమే రోదసీ యాత్ర టికెట్లు కొంటారు. సహజంగా అంతరిక్షంలోకి రానూపోనూ ఒక్కో టికెట్ ధర కోట్ల రూపాయల్లో ఉంటుంది.

మనదేశంలో అంతరిక్ష పర్యాటకానికి ప్రారంభ దశలోనే బోలెడంత క్రేజ్ వచ్చింది. భారతదేశంలో చాలామంది రోదసీ యాత్రలపై ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో 2030 నాటికి భారతదేశంలో తొలిసారి స్పేస్ టూరిజం ప్రారంభించా లని ఇస్రో యోచిస్తోంది. ఈ రోదసీ యాత్రలో ఒక్కో టికెట్ ధర దాదాపు ఆరు కోట్ల రూపాయలు ఉండే అవకాశముంది. ఈ యాత్ర చేసివచ్చిన వారు తమను తాము వ్యోమగాములుగా పిలుచుకోవచ్చు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయని ఇస్రో వర్గాలు వెల్లడించాయి.

     భారతదేశంలో రోదసీ యాత్రలకు మంచి భవిష్యత్ ఉందంటున్నారు నిపుణులు. అంతరిక్ష యాత్ర…నిస్సందేహంగా లాభదాయకమే అంటున్నారు. రానున్న రోజుల్లో అంతరిక్ష యానం అనేది ఒక ప్రధాన ఆదాయ వనరుగా మారుతుం దన్నారు నిపుణులు. స్పేస్ టూరిజానికి వివిధ భారతీయ మంత్రిత్వ శాఖలు కొత్త పథకాలతో ముందుకు వస్తున్నాయి. అంతరిక్ష పర్యాటకానికి మద్దతు ఇవ్వడానికి అనేక వనరులు కూడా ఏర్పాటయ్యాయి. మౌలికంగా స్పేస్ టూరిజం ఇండస్ట్రీకి హై-ఫై టెక్నాలజీ మెషినరీలు చాలా అవసరం అంటున్నారు నిపుణులు.

     యాత్రీకులకు అంతరిక్ష ప్రయాణంలో ప్రత్యక్ష లేదా పరోక్ష అనుభవాన్ని అందించే వాణిజ్య కార్యకలాపాలనే రోదసీ యాత్ర అంటున్నారు. వరల్ట్ టూరిస్ట్ ఆర్గనైజేషన్ ఆఫ్ టూరిజం సంస్థ ఇచ్చిన నిర్వచనం కూడా ఇదే. అంతరిక్ష పర్యాటకం, భూమి ఉపరితలం వద్ద ప్రారంభమవుతుంది. అలాగే అక్కడే ముగుస్తుంది. కొన్నేళ్లుగా ఆర్థిక వ్యవస్థ వృద్ధికి పర్యాటకం ప్రధాన వనరుగా ఉంది. పర్యాటకం ద్వారా అత్యధిక విదేశీ మారక ద్రవ్యాన్ని పొందుతున్న భారతదేశం తాజాగా అంతరిక్ష పర్యాటకంపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం భారతదేశం ఎదురు చూస్తున్న అత్యంత ఉత్తేజకరమైన పర్యాటక రూపాలలో అంతరిక్ష పర్యాటకం ఒకటి. ఇప్పుడు, అంతరిక్షం అందరికీ చివరి సరిహద్దుగా మారింది.

         భారత్‌ ఆర్థిక వ్యవస్థకు అంతరిక్ష పర్యాటకం ఊతం ఇస్తుందంటున్నారు నిపుణులు. అంతరిక్ష పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి భారతదేశం ముందుగా స్పష్టమైన చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో జాతీయత, వ్యోమనౌక ఫిట్‌నెస్‌ను గుర్తించడం, వైద్య ప్రమాణాలు, అంతరిక్ష సిబ్బందికి లైసెన్సింగ్, భద్రతా జాగ్రత్తలు ..ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. రోదసీ యాత్రలను విజయవంతం చేయడానికి భారతదేశం ముందుగా ఈ అంశాలపై దృష్టి పెట్టాలంటున్నారు నిపుణులు.

       ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష యాత్ర పరిధి మరింత విస్తృతమవుతోంది. రోదసీ యాత్ర కాస్తా స్పేస్ అడ్వెంచర్ మోడల్‌గా అభివృద్ధి చెందుతోంది, అయితే కొన్ని కారణాలతో అందుకు అడ్డంకులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం, రాకెట్ ప్రయోగం చాలా ఖరీదైన పరీక్షగా మారింది. కొన్నేళ్లుగా రాకెట్లలో ఉపయోగించే ఇంధనం అలాగే వనరుల ఖర్చు పెరిగింది. రోదసీ యాత్రలు విలాసవంతంగానే కాదు, సాహసయాత్రలుగానూ ఉంటాయి. రోదసీయాత్రల్లో ప్రయాణీకుల భద్రతపై ఎక్కువ దృష్టి పెట్టాయి సదరు కంపెనీలు.

      వీటి సంగతి ఎలా ఉన్నా, అంతరిక్ష పర్యాటకం అనేది చిన్న విషయం కాదు. కోట్లకు కోట్లు పెట్టుబడులు అవసరం. ఈ భారీ పెట్టుబడులను కేవలం ప్రభుత్వ సంస్థలే పెట్టాలనుకోవడం అత్యాశే అవుతుంది. స్పేస్ టూరిజంలో ప్రైవేటు సంస్థల పెట్టుబడులు కూడా అవసరమవుతాయి. అయితే అంతరిక్ష పర్యాటకరంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఎన్ని ప్రైవేటు సంస్థలు ముందుకు వస్తాయనేదే ప్రశ్న. ఈ విషయంలో ప్రైవేటు సంస్థలను అంతరిక్ష పరిశోధకులు ఒప్పించగలగాలి. ప్రైవేటు సంస్థల ఇన్‌వాల్వ్‌మెంట్‌తో స్పేస్ టూరిజాన్ని ఒక రేంజ్‌కు తీసుకెళ్లాలని భావిస్తున్నారు నిపుణులు. ఇదిలా ఉంటే, ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకోవాలని మొదటిసారిగా 1979లో వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ పిలుపునిచ్చింది. ప్రతి ఏడాది సెప్టెంబరు 27న జరుపుకోవడానికి 1980లో వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ పచ్చజెండా ఊపింది. సెప్టెంబర్ 27వ తేదీ ఎంచుకోవడానికి బలమైన కారణం ఉంది. 1970 సెప్టెంబరు 27న ఐక్యరాజ్యసమితి వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అధికారిక హోదాను అందుకుంది. ఇందుకు గుర్తుగా ప్రతి ఏడాది సెప్టెంబరు 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుం టున్నారు.

      ప్రపంచాన్ని ఒకచోట చేర్చే సామర్థ్యం పర్యాటకరంగానికి మాత్రమే ఉంది. అంతర్జాతీయ సమాజంలో పర్యాటకరంగం ప్రమేయం అనేక అంశాల్లో సానుకూల వృద్ధిని పెంపొందించింది. మనదేశ ఆర్థిక వ్యవస్థ విషయానికొస్తే ఉపాధి కల్పనలో పర్యాటకం కీలక పాత్ర పోషిస్తోంది.మనిషి గడపదాటి విశాల ప్రపంచం లోకి అడుగుపెడితే బోలెడన్ని ప్రయోజనాలున్నాయి. కొత్తకొత్త ప్రదేశాలకు వెళ్లడం ద్వారా , మనిషిలో ఒత్తిడి తగ్గుతుంది. డిప్రెషన్ అంటూ ఉంటే మనసు నుంచి ఆ లక్షణాలను పారదోలుతుంది. అన్నిటి కంటే ముఖ్యంగా మనసుకు ఉల్లాసం కలిగిస్తుంది. కొత్త ప్రదేశాలకు వెళ్లడంతో కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. కొత్త అనుభూతులు మిగులుతాయి. దీంతో మనుషుల్లో క్రియేటివిటీ పెరుగుతుంది.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్