స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా కూడా ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోలేదని వ్యాఖ్యానించారు మంత్రి విడదల రజనీ. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని కొనసాగిస్తున్న ఆరోగ్య శ్రీ పథకంపై కొందరు పనిగట్టుకొని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలెవ్వరూ కూడా ఆరోగ్య శ్రీ పై అసత్యాలు నమ్మవద్దని.. ఆరోగ్యశ్రీ లో అన్ని సేవలు అందుబాటులో వున్నాయని మంత్రి వెల్లడించారు. అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో ఆరోగ్య శాఖపై ప్రత్యేక శ్రద్ద చూపుతున్నామన్నారు.