26.2 C
Hyderabad
Thursday, October 23, 2025
spot_img

భీమవరంలోని అల్లూరి స్మృతి వనాన్ని వర్చ్యువల్‌గా ప్రారంభించిన రాష్ట్రపతి

స్వతంత్ర వెబ్ డెస్క్: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటం, దేశ భక్తి అసమానమైనదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌లో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గచ్చిబౌలి స్టేడియంలో ఈ సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ముర్ము మాట్లాడుతూ.. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటం, దేశభక్తి అసమానమైనవని కీర్తించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పోరాటం తరహాలోనే అల్లూరి పోరాటం కూడా ప్రజల్లో ఎంతో స్ఫూర్తి రగిల్చిందని తెలిపారు. అల్లూరి సీతారామరాజు ఒక ప్రత్యేకమైన యుద్ధ నైపుణ్యంతో బ్రిటీష్ వారిని ఎదుర్కొన్నారని ముర్ము వివరించారు. అల్లూరి వంటి మహనీయుల చరిత్రను భవిష్యత్ తరాలకు భద్రంగా అందించాలని పిలుపునిచ్చారు.

కాగా, ఏపీలో భీమవరం వద్ద నిర్మించిన అల్లూరి స్మృతి వనాన్ని గచ్చిబౌలి సభ నుంచి రాష్ట్రపతి ముర్ము వర్చువల్ గా ప్రారంభించారు. 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు కొత్త తరానికి ఆయన పోరాట స్ఫూర్తిని తెలియజేశాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. ‘‘బ్రిటీష్‌ బంధనాల నుంచి భారత మాత విముక్తి కోసం పోరాడిన మన్యం వీరుడు అల్లూరి. అల్లూరి గొప్పతనాన్ని.. చరిత్రను ముందు తరాలకు తీసుకెళ్లాలి. అల్లూరి సీతారామరాజు దైవాంశ సంభూతుడని భావిస్తా. మహా కవి శ్రీశ్రీ అల్లూరి గురించి రాసిన ‘తెల్లవారి గుండెల్లో నిదురించిన వాడా.. మాలో నిదురించిన పౌరుషాగ్ని రగిలించిన వాడా’ సినిమా పాట చాలా పాపులర్‌ అయింది. ఆ పాటను నేను చాలా ఇష్టంగా వినేవాడిని. 26 సంవత్సరాల పిన్న వయసులోనే రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు. భరతజాతి చెప్పుకొనే ఎంతో మంది అమరవీరుల సరసన మేము తక్కువ కాదు అని మన తెలగుజాతిని నిలబెట్టిన గొప్ప మహనీయుడు అల్లూరి’’ అని సీఎం కేసీఆర్‌ కొనియాడారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్