Bride- bridegroom fight | అంతవరకు సాజావుగా సాగిన పెళ్లి తంతులో వధూవరులు ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. ఒకరికొకరు చెంపలు చెళ్లుమనిపించుకున్నారు. దీంతో ఆగకుండా చిన్నపాటి యుద్ధం తలపించేలా ఒకరినొకరు కొట్టుకున్నారు. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో వధువు, వరుడు ఇద్దరు ఒకరికొక్కరు స్వీట్లు తినిపించుకుంటున్నారు. వరుడు స్వీట్ తినిపించబోయేసరికి.. వధువు పెదాలకు తాకటంలో నో చెప్పింది. అయినా కూడా వరుడు ఊరుకోకుండా అలాగే నోట్లో పెడుతుండగా.. ఒక్కసారిగా కోపం పెంచుకున్న వధువు.. వరుడి చెంపపై కోటింది. దీంతో వరుడికి కోపం వచ్చి.. వధువు చెంప చెళ్లుమనిపించాడు. ఒక్కసారిగా వధువుకు కోపం పీక్ స్టేజ్ కి వచ్చింది.
ఇక అంతే… కోపంతో ఊగిపోతూ వరుడిపై దాడి చేసింది. నన్నే కొడతావా అంటూ.. వరుడు వధువును గట్టిగా కొట్టాడు. ఒకరినొకరు కొట్టుకోవడంతో పెళ్లి వేడుకకు వచ్చిన వారందరూ.. షాక్ కు గురయ్యారు. అక్కడ ఉన్న వారు వారిని ఆపడంతో గొడవ సద్దుమణిగింది. ఈ గొడవ అంతటిని వీడియో తీసి.. సోషల్ మీడియా లో షేర్ చేయగా.. పలువురు యూజర్లు విమర్శలు చేస్తున్నారు. కొందరు వీరికి పెళ్లి చేసుకునే అర్హత లేదని.. ఒకవేళా చేసుకున్నా కూడా జీవితాంతం కలిసి ఉండలేరని కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం.. ఇది నిజంగా జరిగిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Kalesh B/w Husband and Wife in marriage ceremony pic.twitter.com/bjypxtJzjt
— Ghar Ke Kalesh (@gharkekalesh) December 13, 2022