రాజకీయాల్లో దూషణలు. పొగడ్తలు.. బెదిరింపులు ఆనవాయితీ అవుతోందని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావు వ్యాఖ్యానించారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి 240 స్థానాలు రావడంతో బీజేపీకి టెన్షన్ పట్టుకుందని ఆయన అన్నారు. ఏం మాట్లాడుతున్నారో బీజేపీ నాయకులకు అర్ధం కావడం లేదని ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్త పాదయాత్ర చేపట్టారని వీహెచ్ గుర్తుచేశారు. రాహుల్ పాదయాత్ర వల్లే ఇండియా కూటమికి ఇన్ని సీట్లు వచ్చాయని అన్నారు.