Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

యాత్రీకుల బస్సుపై ఉగ్రవాదుల కాల్పులు

    జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదం మరోసారి బుసకొట్టింది. కాశ్మీర్ లోయలో మళ్లీ పాత పరిస్థితులు నెలకొంటున్నాయి. తాజాగా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు దారుణాలకు తెగబడ్డారు.యాత్రీకులతో వెళుతు న్న ఒక బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో ఆ వాహనం అదుపు తప్పింది. పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ సంఘటనలో పది మంది చనిపోయారు. 33 మందికిపైగా గాయప డ్డారు. జమ్మూకాశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో ఈ దారుణం జరిగింది.

    శివఖోరి ఆలయం నుంచి కట్రాలోని మాతా వైష్ణోదేవి ఆలయానికి యాత్రీకులతో నిండిన బస్సు వెళుతుండగా తెర్యాత్ గ్రామం దగ్గర ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. బుల్లెట్ దెబ్బ తగలడంతో బస్సు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. దీంతో సదరు డ్రైవర్‌కు బస్సుపై కంట్రోల్ తప్పింది. ఫలితంగా బస్సు అదుపు తప్పి, లోయలో పడిపోయింది. ఉగ్రవాదులు పాతిక నుంచి ముప్పయి 30 తూటాలను పేల్చినట్లు సంఘటనలో గాయపడ్డవారు తెలిపారు. మొహాలకు మాస్కులు పెట్టుకున్న దాదాపు ఏడుగురు ఈ కాల్పులకు పాల్పడినట్లు ఈ సంఘటనలో గాయపడ్డవారు వెల్లడించారు. కాగా చనిపో యినట్లు నటించి, తాము ప్రాణాలు కాపాడుకున్నామని గాయపడ్డవారు పేర్కొన్నారు. ఎరుపు రంగు మఫ్లర్ ధరించిన ఉగ్రవాది ఒకరు కాల్పులు జరపడం తాను చూసినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు పేర్కొన్నారు.

 లోయలోకి బస్సు పడిపోయిన సంగతి తెలియడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి హుటాహుటిన చేరుకున్నారు. స్థానికుల సాయంతో అప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు తొమ్మిది మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో గాయ పడ్డవారిని వివిధ ప్రభుత్వాసు పత్రులకు అధికారులు తరలించారు. చనిపోయినవారంతా ఉత్తరప్రదేశ్  వాసులని తెలిసింది. దాడికి తెగబడ్డ ఉగ్రవాదులను పట్టుకోవడానికి సైన్యం, సీఆర్పీఎఫ్‌, పోలీసు బలగాలు వెంటనే రంగంలోకి దిగాయి. టెర్రరిస్టుల కోసం కాశ్మీర్ అంతటా పెద్ద ఎత్తున వేట మొదలె ట్టారు. సమీపానగల ఉధంపూర్‌, పూంఛ్, రాజౌరీ ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాక్కుని ఉంటారని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. సహజంగా రాజౌరీ, పూంచ్‌ జిల్లాలతో పోలిస్తే, రియాసీ జిల్లాలో ఉగ్రవాద కార్యకలాపాలు బాగా తక్కువ. అయితే అలాంటి ప్రదేశంలోనే ఈసారి టెర్రరిస్టులు తెగబడ్డారు.

ఉగ్రవాదుల కాల్పుల ఘటనపై అమిత్ షా స్పందించారు. బస్సుపై కాల్పులకు పాల్పడ్డవారిని వదిలేదని లేదన్నారు అమిత్ షా. గాయపడ్డవారికి వైద్యసాయం అందించడానికి స్థానిక ప్రభుత్వ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోందన్నారు. ఈ సంఘటనకు సంబంధించి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ తో మాట్లాడి తగు విధంగా ఆదేశాలు జారీ చేశామన్నారు అమిత్ షా. కాగా జమ్మూ కాశ్మీర్లో పర్యాటక బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంపై కేంద్రమంత్రి రామ్‌దాస్ అథవాలే తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్బంగా పాకిస్తాన్‌ కు ఆయన తీవ్ర హెచ్చరిక చేశారు. నరేంద్ర మోడీ నాయకత్వం లో కేంద్రంలో కొత్త సర్కార్ కొలువుతీరుతున్న సమయంలో ఉగ్రవాదులు ఉద్దేశపూర్వకంగా భయాన్ని సృష్టించానికి టూరిస్టు బస్సుపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారని మండిపడ్డారు. ఇటు వంటి సంఘ టనలను భారత ప్రభుత్వం ఏమాత్రం సహించబోదన్నారు. పాకిస్తాన్ కు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రపంచ పటం పై నుంచి పాకిస్తాన్ లేకుండా చేస్తామన్నారు.

  ఉగ్రవాదుల దాడి ఘటనను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖండించారు. ఇటువంటి సంఘ టనలు మరోసారి జరగకుండా చూడాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఉగ్రవాదుల కాల్పుల ఘటనను ఖండించారు. కాగా జమ్మూ కాశ్మీర్‌లో కాల్పులకు తెగబడుతున్న ఉగ్రవాద ముఠాలన్నీ పాకిస్థాన్ నుంచి వస్తున్నాయన్నారు విశ్వ హిందూ పరిషత్ నాయకులు. టెర్రరిస్టు ముఠాలతో దేశానికి పొంచి ఉన్న ప్రమాదానికి తాజా ఘటన అద్దం పడుతోందన్నారు విశ్వ హిందూ పరిషత్ నాయకులు. కాశ్మీర్‌ లోయలోని ప్రజలకు ప్రధాన ఆదాయ వనరు పర్యాటకరంగం. దాదాపు ఐదేళ్ల నుంచి కాశ్మీర్‌ లోయలో పర్యాటక రంగం పుంజుకుంది. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ పుణ్యమా అంటూ కాశ్మీర్ లోయలో శాంతి నెలకొంది. తుపాకీ చప్పుళ్లు ఆగిపోయాయి. దీంతో దేశ, విదేశాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో కాశ్మీర్‌లోయకు రావడం మొదలైంది. ఈ నేపథ్యంలో సామాన్య జనం నాలుగు రాళ్లు సంపాదించుకుం టున్నారు. ఈ పరిస్థితుల్లో ఉగ్రవాదులు జరిపిన దాడిని స్థానికులు కూడా ఖండిస్తున్నారు. దాడి ఫలితం గా కాశ్మీర్ లోయకు పర్యాటకులు రావడం ఆగిపోతుందని భయపడుతు న్నారు. అదే జరిగితే మూడు పూటలా తిండికి కూడా తాము నోచుకోలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్