Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

కాశ్మీర్‌ లోయలో జీ -20 దేశాల సమావేశం

జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దయిన తరువాత శ్రీనగర్‌లో జరిగిన తొలి ఇంటర్నేషనల్ ఈవెంట్ జీ- 20 సదస్సే. 2019 ఆగస్టు ఐదో తేదీన జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టే ఆర్టికల్ 370 ను కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ రద్దు చేసింది. అంతేకాదు అప్పటివరకు ఒక రాష్ట్రంగా ఉన్న జమ్మూకాశ్మీర్‌ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ నేపథ్యంలో అప్పటివరకు జమ్మూకాశ్మీర్‌లో భాగమైన లదాఖ్‌ ప్రాంతాన్ని ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తించారు. ఈ నేపథ్యంలో కిందటేడాది మే నెలలో శ్రీనగర్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య మూడురోజుల పాటు జీ -20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరిగాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూడు రోజుల సమావేశాలను భారత్ నిర్వహించింది. జీ -20 టూరిజం సమావేశాలను భగ్నం చేయడానికి కొన్ని ఉగ్రవాద శక్తులు ప్రయత్నాస్తున్నాయన్న సమాచారం అందడంతో భారత్ అప్రమత్తమైంది. శ్రీనగర్ చుట్టూ భారీ ఎత్తున బలగాలను మొహరించారు. భద్రత విషయంలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కీలక పాత్ర పోషించాయి. సీఆర్పీఎఫ్‌ దళాలు కూడా మాక్ డ్రిల్స్ నిర్వహించాయి. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి కేంద్ర బలగాలు సన్నద్ధమయ్యాయి.

  జీ – 20 సమావేశాలు జరుగుతున్న శ్రీనగర్ చుట్టూ మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, సైన్యం సాయంతో ఎయిర్ యాంటీ డ్రోన్ టెక్నాలజీని కూడా అందుబాటులోకి తెచ్చారు ఉన్నతాధికారులు. జీ-20 సమావేశాలు శాంతియుతంగా నిర్వహించడంలో భాగంగా పోలీసులు, బీఎస్ఎఫ్‌, సీఆర్పీఎఫ్‌, ఎన్‌ఎస్‌జీ సిబ్బంది ని రంగంలోకి దింపారు ఉన్నతాధికారులు. భారత్‌లో జీ -20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరగడం ఇది మూడోసారి. అంతకుముందు గుజరాత్‌లోని రాన్‌ ఆఫ్ కచ్‌ అలాగే పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలోనూ జరిగాయి. కాగా కాశ్మీర్‌లో జీ -20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు నిర్వహించడంపై చైనా, పాకిస్తాన్ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దశాబ్దాల కాలం నాటి కాశ్మీర్ అంశం, భారత్‌, పాకిస్తాన్‌ ల మధ్య వివాదాలకు దారితీసిందని చైనా పేర్కొంది. సున్నితమైన కాశ్మీర్ వివాదాన్ని రెండు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నది తమ అభిప్రా యమన్నారు చైనా అధికారులు. ఈ నేపథ్యంలో కాశ్మీర్‌లో జరిగే జీ -20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలకు తాము హాజరు కాబోవడం లేదని చైనా తన వాదన వినిపించింది.

  ఇదిలా ఉంటే, కాశ్మీర్ అంతర్జాతీయంగా వివాదంలో ఉన్న ప్రాంతమని పాకిస్తాన్ పేర్కొంది. కాశ్మీర్ అంశం, ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో ఏడు దశాబ్దాలుగా ఉన్న వివాదమని పొరుగుదేశం వెల్లడించింది. ఇలాంటి పరిస్థితుల్లో కాశ్మీర్‌లో జరిగే అంతర్జాతీయ ఈవెంట్‌ లో తాము పాల్గొనేదిలేదని పాకిస్తాన్ కుండబద్దలు కొట్టింది. ఈ నేపథ్యంలో అటు చైనా ఇటు పాకిస్తాన్ రెండు దేశాలూ జీ -20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలను బహిష్కరించాయి. కాశ్మీర్‌లో ఇంటర్నేషనల్ ఈవెంట్ నిర్వహిం చడం ద్వారా అక్కడి మెజారిటీ ముస్లింల మద్దతు తమకు ఉందని యావత్ ప్రపంచానికి చాటి చెప్పాలన్నదే భారత్ ఉద్దేశ్యమని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఎన్డీయే ప్రభుత్వాన్ని హిందూ ప్రభుత్వంగా చేసే విమర్శలకు చెక్ పెట్టడానికి జీ -20 సదస్సును భారత్ ఉపయోగించుకుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

  కాశ్మీర్‌, తమ అంతర్భాగమని భారత్ పదేపదే చెబుతోంది. ఈ విషయంలో పాకిస్తాన్ ఎన్ని కుట్రలు చేసినా, తన వైఖరికి కొన్ని దశాబ్దాలుగా భారత్ కట్టుబడి ఉంది. ఇదిలా ఉంటే, భారత్ ఎన్ని ప్రయత్నాలు చేసినా, కాశ్మీర్‌ లో ప్రశాంతతను చెడగొట్టడానికి పొరుగుదేశమైన పాకిస్తాన్ కుట్రలు చేస్తూనే ఉంది. పాకిస్తాన్ వంకర బుద్ది మారడం లేదు. సమయం, సందర్బం లేకుండా ప్రతి వేదిక పై కాశ్మీర్‌ అంశాన్ని పాకిస్తాన్ లేవనెత్తుతూనే ఉంది. ఈ విషయంలో భారత్ ఎన్ని సార్లు అధికారిక ప్రకటనలు చేసినా, పాకిస్తాన్ తన వంకర బుద్ధి మార్చుకోవడం లేదు. జీ -20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలను నిర్వహించడం ద్వారా కాశ్మీర్, తమ దేశంలో అంతర్భాగమేనని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పాలని భారత్ ప్రయత్నించిందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. కాశ్మీర్‌లో అంతర్జాతీయ ఈవెంట్‌ ను నిర్వహించడం ద్వారా సీమాంతర ఉగ్రవాదానికి తాము చెక్ పెట్టినట్లు యావత్ ప్రపంచానికి తెలియచే యాలని భారత్ ప్రయత్నించింది.

  ఒకవైపు భారత్ అభివృద్ధిలో దూసుకుపోతుంటే, పాకిస్తాన్ ఆర్థికం చిన్నాభిన్నమైంది. ప్రపంచం ముందు రుణాల కోసం పాకిస్తాన్ మోకరిల్లుతోంది. ఒకేసారి స్వాతంత్య్రం పొందిన భారత్ వడివడిగా అభివృద్ది వైపు అడుగులు వేస్తే పాకిస్తాన్‌ మాత్రం నిత్యం సంక్షోభాల్లోనే కాలం వెళ్లదీసింది. పాకిస్తాన్‌ లోని వ్యవస్థ లన్నీ అవినీతిలో కూరుకుపోయి నిస్తేజంగా మారాయి. ఇన్నేళ్ల పాకిస్తాన్‌ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ప్రజల కనీస అవసరాలను పట్టించుకున్న పాపాన పోలేదు. విద్య, వైద్య రంగాలతో పాటు మౌలిక వసతులను పాకిస్థాన్‌ ప్రభుత్వాలు గాలికి వదిలేశాయి. బడ్జెట్‌లో రక్షణ రంగానికి అవసరానికి మించిన ప్రాధాన్యం ఇవ్వడం మొదలెట్టాయి. భారత్ పట్ల అనవసరపు వ్యతిరేకతతో ఖజానాలోని డబ్బును అధు నాతన ఆయుధాలు కొనుక్కోవడానికే పాకిస్తాన్‌ ప్రభుత్వాలు ప్రయత్నించాయి.

  పాకిస్తాన్‌ అప్పుల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రపంచపటంపై అప్పుల అప్పారావుగా పాకిస్తాన్‌ పేరు తెచ్చుకుంది. దీంతో అన్నిటికీ చైనా మీద ఆధారపడటం మొదలెట్టింది. ఇదే చివరకు పాకిస్తాన్‌ కొంపముంచింది. ఈ సంగతి ఎలాగున్నా భారత్ పట్ల అపోహతో, అనవసరపు వ్యతిరేకతతో డ్రాగన్ చైనాకు ఇమ్రాన్ ఖాన్ హయాంలో పాకిస్తాన్ దగ్గరైంది. ఆసియా వ్యవహారాల్లో చైనాకు పాకిస్తాన్ మద్దతు పలికింది. తెలివి తక్కువగా చైనా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. దీంతో పాకిస్తాన్ ఆర్థికవ్యవస్థ కుదేలైంది. ఫలితాలు అమాయక పాకిస్తాన్ ప్రజలు ఇప్పుడు ఫలితాలు అనుభవిస్తున్నారు. ఆర్థికంగా ఇంతగా దిగజారిగా కాశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టడానికి ఏమాత్రం వెనకాడటం లేదు పాకిస్తాన్. ప్రధానంగా కాశ్మీర్ ప్రజల ప్రధాన ఆదాయ వనరు అయిన పర్యాటకరంగాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగాగా తాజాగా యాత్రీకులతో వెళుతున్న బస్సుపై పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.అమాయకులను పొట్టన పెట్టుకున్నారు.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్