టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనపర్తి(Anaparthi) వెళ్తున్న చంద్రబాబు కాన్వాయ్ ను పోలీసులు అడ్డగించారు. బారికేడ్లు పెట్టి వాహనాలు వెళ్లకుండా నిలువరించారు. దీంతో పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తెలుగు తమ్ముళ్లు బారికేడ్లను తోసి ముందుకు వచ్చారు. అయినప్పటికీ చంద్రబాబు((Chandrababu)) కాన్వాయ్ అనపర్తి చేరుకోకుండా.. అనపర్తికి సమీపంలో రోడ్డుకు అడ్డంగా వాహనాన్ని అడ్డుపెట్టారు పోలీసులు. దీంతో స్థానికంగా టెన్షన్ వాతావరణం నెలకొంది.
Read Also: