టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) సాక్షిగా మాజీ మంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్పకు(MLA Chinarajappa) ఘోర అవమానం జరిగింది. మాజీ ఎమ్మెల్యే బొడ్డు భాస్కర రామారావు విగ్రహావిష్కరణ సభ వేదిక నుండి చినరాజప్పను కిందకు దించాలని టీడీపీ కార్యకర్తలు చంద్రబాబును కోరారు.
ఇది సభా సాంప్రదాయం కాదని మీ ఎమ్మెల్యేను, మీ నాయకుడిని అగౌరపరచడం మంచిది కాదని కార్యకర్తలకు సర్ది చెప్పేందుకు చంద్రబాబు(Chandrababu) ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే రాజప్పను ముచ్చటగా మూడోసారి గెలిపించాలని చంద్రబాబు కార్యకర్తలను కోరారు. దీంతో మరింత రెచ్చిపోయిన కార్యకర్తలు.. చినరాజప్ప గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.