30.7 C
Hyderabad
Tuesday, March 18, 2025
spot_img

కాకినాడ జిల్లా తునిలో కొనసాగుతున్న టెన్షన్‌

కాకినాడ జిల్లా తునిలో టెన్షన్ వాతావరణ నెలకొంది. మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా టీడీపీ, వైసీపీ నేతల బాహాబాహీకి సిద్ధమయ్యారు. నిన్న జరగాల్సిన ఎన్నిక కోరం లేని కారణంగా నేటికి వాయిదా పడింది. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా తునిలో పరిస్థితులు ఏర్పడ్డాయని… వైసీపీ ఆరోపించింది. చలో తునికి వైసీపీ శ్రేణులు పిలుపునీయగా… ఫ్యాన్ పార్టీ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పోలీసుల నిఘా నీడలో తుని పట్టణం ఉంది. ఇప్పటికే 144 సెక్షన్ అమలులో ఉండగా… భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కౌన్సిలర్లను కిడ్నాప్ చేస్తున్నారని ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు వైసీపీ, టీడీపీ కార్యకర్తలు.

వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా చలో తుని పిలుపుమేరకు ముద్రగడ పద్మనాభం , వంగా గీత తుని చేరుకున్నారు. అయితే, అప్రమత్తమైన పోలీసులు వెంటనే వారిని అడ్డుకుని.. తిరిగి వాళ్ళ స్వగ్రామం పంపించేశారు. ASP ఫాటిల్ పర్యవేక్షణలో CRPF బలగాలు, పోలీసులు, భారీగా మోహరించారు. మున్సిపల్ కార్యాలయం చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక..నేపథ్యంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

కాకినాడ నుంచి పిఠాపురం వెళ్తున్న మాజీ మంత్రి కన్నబాబు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ అనంత బాబుని పోలీసులు అడ్డుకున్నారు. తుని వెళ్లకుండా పిఠాపురం టోల్‌గేట్ వద్ద అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం నాయకులకి అనుమతులు ఇచ్చి తమకెందుకు అనుమతులు ఇవ్వడం లేదంటూ ఫైర్ అయ్యారు. టిడిపికి ఒక న్యాయం తమకు ఒక న్యాయమా అంటూ పోలీసులను నిలదీశారు. ఈ క్రమంలో మాజీ మంత్రి కన్న బాబు, ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ అనంత బాబు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. జై జగన్ అంటూ నినాదాలతో టోల్‌గేట్‌ ప్రాంతం మార్మోగింది. పిఠాపురం టోల్‌గేట్‌ వద్దకు భారీగా వైసీపీ నాయకులు కార్యకర్తలు చేరుకున్నారు

తుని వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పిలుపునివ్వగా, ఇవాళ తెల్లవారుజామునుంచి జక్కంపూడి రాజా ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. జక్కంపూడి రాజాను గృహ నిర్బంధం చేశారు. కాకినాడ జిల్లా కాకినాడ ప్రత్తిపాడులో వైఎస్సార్‌సీపీ నేత మురళీకృష్ణ రాజును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

నాలుగు ఏళ్ల క్రితం మున్సిపల్ ఎన్నికలు జరగ్గా తునిలోని 30 వార్డుల్లోనూ వైసీపీ అభ్యర్థులే విజయం సాధించారు. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను సైతం వైసీపీ దక్కించుకుంది. 30 మంది కౌన్సిల్ సభ్యులకు గాను ఒకరు మరణించగా, మరో కౌన్సిల్ సభ్యుడు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో పదవికి రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం కౌన్సిల్ సభ్యుల సంఖ్య 28కి చేరుకుంది. వైస్ ఛైర్మన్ అకాల మరణంతో ఆ పదవి ఖాళీ కావడంతో ఒక్క స్థానం కూడా దక్కని టీడీపీ ఆ పదవిపై కన్నేసింది. ఎలాగైనా వైస్ ఛైర్మన్ పదవిని దక్కించుకునేందుకు ఎత్తుకు పైఎత్తు వేస్తోంది. ఇప్పటికే 10 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరిపోయారు. దీంతో ఇద్దరు మాజీ మంత్రుల మధ్య పోటాపోటీగా వార్ కొనసాగుతుంది. ఇప్పటికే మూడుసార్లు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. నేటితోనైనా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలకు శుభం కార్డు పడుతుందా అంటే ప్రస్తుత పరిస్థితులు అలా కనిపించడం లేదు.

Latest Articles

‘కాలమేగా కరిగింది’ ట్రైలర్ చూశారా?

వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "కాలమేగా కరిగింది". ఈ సినిమాను శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్