స్వతంత్ర వెబ్ డెస్క్: ఆ యువకుడు వాన ముచ్చట ఎప్పటికప్పుడు పక్కాగా చెప్తున్నాడంటూ నెటిజన్లు అతన్ని ఆకాశానికెత్తుతున్నారు. హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన టీ బాలాజీ బీటెక్ రెండో సంవత్సర విద్యార్థి. ట్విట్టర్‌లో ‘తెలంగాణ వెదర్‌మ్యాన్’ పేరుతో ఖాతా తెరిచాడు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తనదైన శైలిలో ఉపయోగించుకుంటూ వర్షాకాలంలో తాజా వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు పోస్టు చేస్తున్నాడు.
ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల సమాచారాన్ని ఎంతో కచ్చితంగా అందిచండంతో వేలాది మంది నెటిజన్లు అభినందించారు. సుమారు గంట పాటు ఆన్‌లైన్‌లో నేరుగా మాట్లాడి వర్షం సమాచారాన్ని తెలుసుకునేందుకు ఒకేసారి 1355 మంది ప్రయత్నించడం యాధృచికం. ఇలా రాష్ట్రంలో చాలా మంది వాతావరణ సమాచారం కోసం అతని ట్విట్టర్ అప్‌డేట్స్‌పై ఆధారపడుతున్నారు. ప్రసుత్తం ‘తెలంగాణ వెదర్ మ్యాన్’ను 64 వేల మంది అనుసరిస్తున్నారు.