29.3 C
Hyderabad
Sunday, March 1, 2026
spot_img

తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు

   తెలంగాణ పదో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొన్నం, విప్పులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో ప్రజల సంక్షేమమే తమ ధ్యేయంగా పని చేస్తామన్నారు.రంగారెడ్డి జిల్లా పటాన్‌ చెరు నియోజకవర్గంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. స్థానిక అమరవీరుల స్థూపం వద్ద బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, ఎంపీపీ, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ సీనియర్ నాయకుడు, బీఆర్ఎస్‌ శ్రేణులు పాల్గొన్నారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. దీనికి మేయర్ గుండు సుధారాణి ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగరవేశారు. కార్యక్రమంలో కమిషనర్, కార్పొరేటర్లు, సిబ్బంది పాల్గొన్నారు.తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సంబరాలు అంబరాన్నం టాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జాతీయ పతాక ఆవిష్కరించారు. పలువురు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, సచివాలయం అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

   తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నాయకులు, అధికారులు అమరవీరుల స్థూపం వద్ద ఘన నివాళులు అర్పించారు. తాజాగా హన్మకొండలోని అమర వీరుల స్థూపం వద్ద కలెక్టర్ సిక్తా పట్నాయక్ నివాళులర్పించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నివాళులర్పించారు.కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సమీకృత కార్యాలయంలో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. అమరవీరులకు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే నివాళు అర్పించి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సురేష్ కుమార్, అడిషనల్ కలెక్టర్, జిల్లా అధికా రులు పాల్గొన్నారు.రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్స వ వేడుకులు ఘనంగా జరిగాయి. స్థానిక అమరవీరుల స్థూపం వద్ద ఎమ్మెల్యే మల్‌రెడ్డి ఘన నివాళులు అర్పించారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేస్తామ న్నారు. రాష్ట్ర ప్రజలకు ఎల్ల ప్పుడూ పథకాలు అందించడంలో ముందు ఉంటూతెలంగాణను మరింత ముందుకు తీసుకెళ్లడానికి కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుందన్నారు.

వరంగల్  జిల్లాలోని అమరవీరుల స్థూపం వద్ద ప్రజలు నివాళులర్పిస్తున్నారు. ప్రధాన కూడళ్లలో జాతీయ జెండా ఆవిష్కరించి ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా వరంగల్‌లోని అమర వీరుల స్థూపం వద్ద జిల్లా కలెక్టర్ ప్రావీణ్య నివాళులర్పించి, తెలంగాణ తల్లికి పూలమాల వేశారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాచకొండ కమిషనర్ సీపీ జోషి కార్యాలయ సిబ్బందితో కలిసి జెండా వందనం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజలకు అభినందనలు తెలియజేశారు సీపీ. తాను గత 20 సంవత్సరాలుగా పోలీస్ డిపార్ట్‌మెట్‌లో పనిచేస్తున్నానని, రాష్ట్ర విభజనకు ముందున్న పరిస్థితులు విభజన తర్వాత జరిగిన అభివృద్ధిని తాను కల్లారా చూశానన్నారు. ఉద్యమ కాల చరిత్రలో తాను కూడా ఉండటం తన అదృష్టంగా అభివర్ణించారు. ఉద్యమ సమయంలో పోలీస్ శాఖ చాలా బాధ్యతగా పనిచేసిందన్నారు.తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చంచల్ గూడకేంద్ర కారాగారంలో ఘానంగా నిర్వహించారు. జైలు సూపరింటెండెంట్ నవాబ్ శివకుమార్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసు లు, జైలు సిబ్బంది గౌరవ వందనాన్ని స్వీకరించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్