వివాహ రిజిస్ట్రేషన్ వ్యవహారంపై తల్లిదండ్రుల వాదన ముఖ్యమని భావించింది తెలంగాణ హైకోర్టు. వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేసేందుకు సబ్‌రిజిస్ట్రార్ నిరాకరించారంటూ కోర్టును ఆశ్రయించింది హైదరా బాద్‌కు చెందిన ఓ ప్రేమ జంట. ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన వైదేహి, యూసుఫ్‌గూడకు చెందిన నజీబుద్దీన్ లు తమ వివాహాన్ని సబ్‌రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేయకపోవడాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టారు జస్టిస్ ఎన్.వి.శ్రవణ్ కుమార్. అయితే వేర్వేరు మతాలకు చెందిన ఇద్దరు యువతీయువకుల ప్రేమ వివాహానికి యువతి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో వారు లేకుండా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారని, ఈ మేరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దరఖాస్తు చేసు కోగా యువకుడు ముస్లిం కావడంతో తమ కుమార్తె పెళ్లిని అడ్డుకుంటున్నారని అతనికి ఎలాంటి ఆదాయం లేనందున వివాహానికి అనుమతించరాదంటూ ఆమె తల్లిదండ్రులు రిజిస్ట్రార్ వివాహ రిజిస్ట్రే షన్‌కు నిరాకరించారని పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. వాదనలు విన్న న్యాయ మూర్తి ఈ విషయంలో తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకోవాల్సి ఉందని వారి వాదనలు వినకుండా ఆదేశాలివ్వలేమని తెలిపారు. ఈ క్రమంలోనే వారిని ప్రతివాదులుగా చేర్చడానికి గడువు కావాలని పిటిష నర్ తరపు న్యాయవాది కోరడంతో అందుకు అనుమతిస్తూ విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.