ఆస్ట్రేలియా గడ్డపై భారత్ బోణి అదిరిపోయింది. పెర్త్ టెస్టులో ఆసిస్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది. 534 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియాను 238 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో 295 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకోవడం విశేషం. తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులకే ఆలౌట్ అయినా.. ఆ తర్వాత భారత్ పుంజుకుంది. ఈ గెలుపుతో భారత్ 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ డిసెంబర్ 6 న అడిలైడ్ వేదికగా జరుగుతుంది.
తొలి ఇన్నింగ్స్ లో భారత్ 150 పరుగులు చేసి ఆలౌట్ అయింది. నితీష్ కుమార్ రెడ్డి 41 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో హేజల్ వుడ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా భారత పేసర్ల ధాటికి 104 పరుగులకు ఆలౌట్ అయింది. బుమ్రా, సిరాజ్ చెరో 3 వికెట్లు తీసుకున్నారు.