వైసీపీ నేతలపై అసభ్యకరమైన పోస్టింగ్స్ పెట్టిన వారిపై ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని మాజీమంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. అసభ్యకర పోస్టులు పెడితే టీడీపీ వారిని కూడా అరెస్ట్ చేస్తామని చంద్రబాబు నీతి వాక్యాలు చెప్పారని అన్నారు. వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటున్నామని చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. పోలీసులు స్పందించకుంటే న్యాయ స్థానాల్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. స్పీకరైనా, మంత్రి అయినా చట్టం దృష్టిలో ఒకటే అన్నారు.
డైరెక్టర్ రాంగోపాల్ వర్మపైన కూడా కేసులు పెట్టారని మాజీమంత్రి అంబటి రాంబాబు అన్నారు. పోసాని మురళీకృష్ణ జగన్ అభిమాని అని… ఆయనపై కేసులు పెట్టి భయపెట్టొచ్చేమో కానీ వైయస్ జగన్‌పై ఆయనకున్న ప్రేమను మాత్రం తొలగించలేరన్నారు. రెడ్‌బుక్ లోకేష్ రాశారని… ఇప్పుడు రెడ్‌బుక్ లోకేష్‌కు శాపంగా మారుతోందన్నారు. రెడ్‌బుక్ రచయితగా లోకేష్ చరిత్రలో నిలిచిపోతాడని అంబటి ఎద్దేవా చేశారు.