19.7 C
Hyderabad
Tuesday, January 27, 2026
spot_img

ఏపీలో కొలువుదీరనున్న టీడీపీ ప్రభుత్వం

  ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. అతి త్వరలోనే సీఎంగా టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఈసారి ఏర్పడే ప్రభుత్వం కూటమిది కావడంతో భాగస్వామ్య పక్షాలైన జనసేన, బీజేపీ ప్రభుత్వంలో భాగస్వాములవుతాయా?అసలు మంత్రి పదవులంటూ లభిస్తే మూడు పార్టీల నుంచి ఎవరెవరు రేసులో ఉంటారు అన్నదానిపై రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా చర్చ సాగుతోంది.

  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి కనీవిని ఎరుగని స్థాయిలో బంపర్ మెజార్టీతో విజయం సాధించింది. త్వరలోనే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు సైతం జోరుగా సాగుతున్నాయి. హస్తిన వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు తన ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరు కావాలంటూ కమలం అగ్రనేతలను ఇప్పటికే ఆహ్వానించారు. ఇవన్నీ కాస్తా పక్కన పెడితే త్వరలోనే మంత్రివర్గాన్ని చంద్రబాబు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎవరెవరు మంత్రిమండలిలో ఉంటారన్న దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. అయితే 164 స్థానాలు సాధించడం, జనసేన, బీజేపీ పార్టీలు కూడా కలిసి ఉండడంతో ఆశావహులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. పైగా వైసీపీ పాలనలో పార్టీకి అన్ని విధాలుగా అండదండలు అందించిన వాళ్లను సైతం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి లెక్కలన్నీ వేసుకుంటే మంత్రివర్గం ఏర్పాటు టీడీపీ అధినేతకు కత్తిమీద సాములా మారుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదన్న మాట విన్పిస్తోంది.

  ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ కీలకంగా మారతారని ఆయన సోదరుడు నాగబాబు ప్రకటించారు. దీంతో.మంత్రివర్గంలో జనసేనకు చోటు దక్కడం ఖాయమనే చెప్పాలి. అటు రాష్ట్ర బీజేపీ నేతలకు సైతం 2014 మాదిరిగానే భాగస్వామ్యం ఖాయమన్న మాట విన్పిస్తోంది. దీంతో ఇటు టీడీపీ, అటు జనసేన, బీజేపీ నుంచి మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్న వారి సంఖ్య పెద్ద ఎత్తున ఉంది. పైగా సామాజిక సమీకరణాలు, జిల్లాల వారీగా లెక్కలు, పార్టీ కోసం గట్టిగా కష్టపడిన వారు ఇలా చూసుకుం టూ వెళితే ఎవరెవరికి చోటు దక్కుతుందన్నది ఆసక్తి రేపుతోంది. మరోవైపు గతానికి భిన్నంగా ఈసారి ఎలాంటి మొహమాటాలకు వెళ్లొద్దని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలు స్తోంది. పైగా క్లీన్ ఇమేజ్ ఉన్న వారికి ఎక్కువగా అవకాశం ఇచ్చే పరిస్థితులు కన్పిస్తున్నాయి. యువత ఆశలు, ఆకాంక్షలు సైతం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సీనియర్ల కన్నా యువత, బలహీన వర్గాలు, మహిళలకు అధిక సంఖ్యలో ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ఇప్పటికే తెలుగుదేశం వర్గాల్లో చర్చ నడు స్తోంది.

   పార్టీ వర్గాల్లో విన్పిస్తున్న సమాచారం ప్రకారం మంత్రివర్గంలో చోటు దక్కించుకునే వారిలో మహిళల విషయానికి వస్తే కడప నుంచి గెలిచిన మాధవీరెడ్డికి అవకాశం ఉండొచ్చని చెబుతున్నారు. వైసీపీ అధినేతకు కంచుకోటైన కడప గడ్డపై విజయం సాధించడం ఈమెకు ప్లస్ పాయింట్‌గా చెబుతున్నారు. అలాగే పుట్టపర్తి నుంచి గెలిచిన సింధూర రెడ్డి, పెనుకొండ నుంచి విజయం సాధించిన సవిత పేర్లు విన్పిస్తున్నాయి. ఎస్సీల నుంచి బండారు శ్రావణి, నెలవల విజయశ్రీ, ఎస్టీల నుంచి శిరీషాదేవి, జగదీశ్వరి ఉన్నారు. బీసీల నుంచి గెలిచిన మహిళల్లో గళ్లా మాధవి, యనమల దివ్య పేర్లు విన్పిస్తు న్నాయి. ఇక, సీనియర్ల విషయానికి వస్తే తంగిరాల సౌమ్య, వంగలపూడి అనిత పేర్లూ ప్రచారంలో ఉన్నాయి. మొత్తంగా మహిళల్లో ఇద్దరికి అవకాశం దక్కవచ్చన్న ప్రచారం నడుస్తోంది.ఇక, టీడీపీ సీని యర్ల విషయానికి వస్తే.. అచ్చెన్నాయుడు, కూన రవికుమార్, కోండ్రు మురళీ మోహన్, ఆర్‌వీఎస్‌కే రంగా రావు, కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, పల్లా శ్రీనివాసరావు పేర్లు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పరిశీలిస్తున్నారు. యనమల రామకృష్ణుడు, చిన రాజప్ప, జ్యోతుల నెహ్రూ, బుచ్చయ్య చౌదరి, పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, రఘురామకృష్ణంరాజు పేర్లు ఉభయ గోదావరి జిల్లాల నుంచి రేసులో ప్రముఖంగా విన్పిస్తున్నాయి.

  ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల విషయానికి వస్తే.. గద్దె రామ్మోహన్, కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, బోండా ఉమా, శ్రీరాం తాతయ్య, కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనంద్‌ బాబు, శ్రావణ్ కుమార్‌ తోపాటు మరికొందరి పేర్లు విన్పిస్తున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లా చూస్తే గొట్టి పాటి రవికుమార్, ఏలూరి సాంబ శివరావు, విజయ్ కుమార్, డోలా బాల వీరాంజనేయస్వామి ప్రముఖంగా కన్పిస్తున్నాయి. ఇక, ఉమ్మడి నెల్లూరు జిల్లా విషయానికి వస్తే, నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమో హన్ రెడ్డిలలో ఒకరికి బెర్త్ ఖాయమన్న మాట గట్టిగా ప్రచారంలో ఉంది. ఇక, రాయలసీమ జిల్లాల్లోనూ మంత్రి వర్గంలో చేరేందుకు ఆశావహులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అమర్‌నాథ్‌రెడ్డితోపాటు ఎస్సీ వర్గం నుంచి ఒకరు ఉండే ఛాన్సుంది. పయ్యావుల కేశవ్, కాలువ శ్రీనివాసులు, పరిటాల సునీత, కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, జనార్థన్ రెడ్డి, పుట్టా సుధాకర్ యాదవ్, సహా మరికొందరి పేర్లను టీడీపీ అధినేత పరిశీలిస్తు న్నట్లు సమాచారం. మైనారిటీల విషయానికి వస్తే, ఎన్‌ఎండీ ఫరూఖ్, నసీర్, షాజహాన్ బాషా పేర్లు ప్రముఖంగా లిస్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆయా జిల్లాల్లో ఇంత మంది పోటీలో ఉండడం తో సామాజిక సమీకరణాలు, యువతకు ప్రాధాన్యం, సీనియారిటీకి గౌరవం, సచ్చీలత సహ మరెన్నో అంశాలను గమనించి, వీరిలో కొందరికి అవకాశం ఇవ్వాలని టీడీపీ అధినేత యోచిస్తున్నారని తెలుగు దేశం వర్గాలు చెబుతున్నాయి.

  జనసేన మంత్రివర్గంలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ ఆ పార్టీలో ప్రచారం సాగుతున్న వేళ మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి పదవి సహా మరో మూడు బెర్తులు దక్కే అవకాశాలున్నట్లు సమా చారం. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీలతోపాటు అగ్రవర్ణాలకు చెందిన వారు ఎన్నిక కావడంతో ఒక్కో సామాజిక వర్గం నుంచి ఒక్కొక్కరికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ప్రభుత్వంలో ఏ పాత్ర పోషిస్తారన్నది ఆసక్తిరేపుతోంది. పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతు న్నట్లుగా డిప్యూటీ సీఎం పదవి తీసుకుంటారా లేక మరోటా అన్నది ఉత్కంఠగా మారింది. ఇక, పార్టీ తరఫున నాదెండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణకు మంత్రివర్గంలో బెర్త్ ఖాయమన్న మాట విన్పిస్తోంది. మరోవైపు బీజేపీ నుంచి ఇద్దరికి అవకాశం లభిస్తుందన్న మాట విన్పిస్తోంది. 2014 నాటి టీడీపీ కూటమి ప్రభుత్వం లోనూ ఇద్దరికి కేబినెట్‌లో చోటిచ్చారు టీడీపీ అధినేత. అయితే ఈసారి ఎంత మందికి అవకాశం ఇస్తారన్నది ఉత్కంఠగా మారింది. మంత్రి వర్గం రేసులో ఉన్న వారిలో ప్రధానంగా సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, సత్యకుమార్, పార్థసారధి పేర్లు విన్పిస్తున్నాయి. మొత్తంగా చూస్తే, ఆశావ హులు భారీ సంఖ్యలో ఉండడం, కూటమి ప్రభుత్వం కావడంతో మంత్రివర్గాన్ని టీడీపీ అధినేత ఏ విధం గా బ్యాలెన్స్ చేస్తారన్న ఆసక్తి అందరిలో నెలకొంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్