హైదరాబాద్ మల్కాజిగిరిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వెస్ట్ మారేడ్‌పల్లిలోని బీఆర్‌ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఇంటికి టాస్క్‌ఫోర్స్ పోలీసులు చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. బంజారాహిల్స్ సీఐ విధులను అడ్డుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డితోపాటు ఎర్రోళ్ల శ్రీనివాస్‌పై కూడా కేసు నమోదయింది. ఈ క్రమంలోనే శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆయన నివాసానికి చేరుకున్నట్టు తెలుస్తోంది. అయితే,.. నోటీసులు ఇవ్వడానికే వచ్చామని పోలీసులు చెబుతున్నారు. ఇక ఇప్పటికే కౌశిక్‌రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 10 గంటలకు విచారణకు రావాలసిందిగా ఆదేశాలు జారీ చేశారు.