Andhra Pradesh | అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా విధుల పట్ల నిర్లక్ష్యంపై మున్సిపల్ కార్యాలయంలో వంట వార్పుకు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలంతా ఈ వంటా వార్పుకు హాజరై విజయవంతమ్ చేయాలని కోరారు. మరోవైపు తాడిపత్రిలో పోలీసులు మోహరించారు. జేసీ పిలుపుతో పోలీసులు భద్రతను పెంచారు. అయితే వంటా వార్పు కార్యక్రమానికి పోలీసులు అనుమతి లేదంటున్నారు. ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్దకు పోలీసులు చేరుకున్నారు.