సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు శ్రీస్వయాంభూ శంబు లింగేశ్వరస్వామి దేవస్థానంలో..మహాశివరాత్రి పండగ అంగరంగవైభవంగా సాగాయి. మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు వారికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మహా శివరాత్రి సందర్భంగా శ్రీ స్వయంభు లింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఓం నమో శివాయ అంటూ మార్మోగింది. భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు మొక్కులు తీర్చుకున్నారు.
వేకున తెల్లవారుజామున స్వామిని దర్శనం చేసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి అన్నారు. జాతర ఐదు రోజుల పాటు జరుగుతుందని తెలిపారు. లక్షల మంది వచ్చిన ఐదు రోజుల పాటు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సంవత్సర సంవత్సరానికి జాతర దిన దినాభివృద్ధి జరగాలని కోరుకుంటున్నానని చెప్పారు. కోటి రూపాయలతో గుడి రాజగోపురం నిర్మాణం చేపడుతామని..జాతరకి కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు మంత్రి.