వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాడ్లాపూర్‌లో బీటీ రోడ్డు కోసం వేసిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అయితేరాజకీయ కక్షతోనే కావాలని కొందరు వ్యక్తులు చేశారంటూ ఫైర్ అయ్యారు బీఆర్‌ఎస్ నేతలు. తాము చేసిన అభివృద్ధి పనులు కనిపించకూడదనే అక్కసుతో శిలాఫలకాన్ని ధ్వంసం చేశారని ఆరోపించారు. గ్రామం లో ఓ కాంగ్రెస్ నాయకుడి పుట్టిన రోజు వేడుకలు జరిగాయని, ఆ వేడుకల తర్వాత శిలాఫలకాన్ని ధ్వంసం చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.