జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కీచక ఖాకీ ఉదంతం వెలుగు చూసింది. మహదేవపురం మండలం కాళేశ్వరం ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై భవానిసేన ఓ మహిళా కానిస్టేబుల్ తనపై వరుసగా అత్యా చారానికి పాల్పడ్డాని ఆరోపిస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. విషయం ఎవరికైనా చెబితే తుపాకీ తో చంపేస్తామని బెదిరించాడని వాపోయింది. ఘటనపై స్పందించిన పై అధికారులు ఇద్దరు డీఎస్పీలు, సీఐల ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. అయితే విచారణలో ఆ ఒక్క మహిళే కాక మరో ఇద్దరు లేడీ కానిస్టేబుళ్లను కూడా వేధించినట్టు తేలడంతో భవానిసేనపై పలు సెక్షన్ల కిందం కేసు నమోదు చేసినట్టు సమాచారం. సదురు ఎస్సైని కస్టడీకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక గతంలోని ఇలా వేధింపుల కారణంగానే అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు..