ప్రస్తుతం యువత అన్ని రంగాల్లో ముందున్నారు.. కాని కొంత మంది అడ్డదారులు తొక్కుతూ.. తొక్కిస్తూ అనవసరమైన వ్యసనాలకు బానిసలవుతున్నారు. రీసెంట్‌గా ఎంతో మందిని ప్రభావితం చేసిన బెట్టింగ్ యాప్స్ ఆడటం వల్ల డబ్బులు సంపాందించవచ్చని కొందరు, ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుందని మరికొందరు.. ఎంటర్‌టైన్‌మెంట్ దొరుకుతుందని ఇంకొందరు మాయా మాటలు చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారు. వ్యసనం వల్ల బాగుపడ్డట్టుగా చరిత్రలో లేదు. దయచేసి ఈ బెట్టింగ్ యాప్‌లను డిలీట్ చేయండి. ఈ యాప్‌కు దూరంగ ఉండండి. మిమ్మలను నమ్ముకున్న వాళ్ల కోసం, మీ జన్మనిచ్చిన తల్లిదండ్రుల కోసం ఒకసారి ఆలోచించండి ఇలాంటి యాప్‌లను ప్రమోట్ చేసే వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవడానికి మన ప్రభుత్వం, సజ్జనార్ సార్ సిద్ధంగా ఉన్నారు.