స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కత్తిపోట్లు కలకలం రేపింది. గాయత్రి గార్డెన్ లో ఏర్పాటు చేసిన దావత్ లో యువకుల మధ్య గొడవ తలెత్తింది. ఒకరిపై ఒకరు మాటమాట పెరిగి చివరికి కత్తితో పొడుచుకునేదాకా వచ్చింది. ఓ యువకుడిపై మరొక వ్యక్తి కత్తితో దాడి చేశారు. కాపాడబోయిన మరో యువకుడికి కత్తి గుచ్చుకోవడంతో గాయాలు అయ్యాయి. వెంటనే భాదితులను ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్ కి పంపించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి దర్యాప్తు చేస్తున్నారు.


