20.7 C
Hyderabad
Tuesday, March 18, 2025
spot_img

పవర్‌నాప్‌తో ఇన్ని ప్రయోజనాలా?

కొందరు మధ్యాహ్నం పూట ఓ పావు గంట లేదా అర్ధగంట కునుకు తీస్తుంటారు. ఇంట్లో ఉన్నా, ప్రయాణాల్లో అయినా కాసేపు నిద్రలో జోగుతుంటారు. ఇలాంటి పగటి నిద్ర మంచిదేనని నిపుణులు అంటున్నారు. మానసిక స్థితిని మెరుగుపరచడంతోపాటు ఆరోగ్యానికీ భరోసా ఇస్తుందని చెబుతున్నారు. ఎందుకంటే పగటినిద్ర.. ఒత్తిడిని చిత్తు చేస్తుందట . హృద్రోగ సమస్యలనూ దూరం చేస్తుంది. మధ్యాహ్న భోజనం తర్వాత కాసేపు కునుకు తీయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని జర్నల్‌ ఆఫ్‌ అమెరికా హార్ట్‌ అసోసియేషన్‌ అధ్యయనంలో తేలింది.

సాధారణంగా మనం పగటిపూట పని చేసినప్పుడు మధ్యాహ్నానికి కాస్త అలసట ఉంటుంది. ఆ సమయంలో కునుకు తీస్తే ఆ తర్వాత తాజాగా అనుభూతి చెందుతారు. రోజులో ఈ రకమైన పవర్ నాప్ తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని మెరుగు పరచుకోవచ్చు. ఇది శారీరక, మానసిక ప్రయోజనాలను అందిస్తుంది. రోజంతా పనిచేసిన తర్వాత విపరీతంగా అలసిపోయినట్లు అనిపిస్తే, ఏకాగ్రత కోసం కూడా పవన్‌ నాప్‌ తీయొచ్చు. కొందరు మధ్యాహ్నం ఒక గంట లేదా రెండు గంటలు నిద్రపోతారు. కానీ పని నుండి విరామం తీసుకోవడం, బదులుగా కొన్ని నిమిషాలు నిద్రపోవడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. పగటిపూట పవర్ నాప్‌ తీసుకోవడం అలసటను అధిగమించడానికి ఉత్తమ మార్గం. ఇది మెదడు, శరీరం రెండింటికి ప్రయోజనకరంగా ఉంటుంది.

ఒక చిన్న పవర్ నాప్‌ తీసుకోవడం ఏకాగ్రతను పెంచుతుంది. దీనివల్ల పనిపై బాగా దృష్టి పెట్టగలరు. అంతేకాకుండా పగటిపూట నిద్రపోవడం ద్వారా సృజనాత్మకతను పెంచుతుంది. మెదడు కొత్త మార్గాల్లో ఆలోచించడానికి సహాయపడుతుంది. మరింత శక్తివంతంగా ఉంటారు. ఇది అభ్యాస సామర్థ్యాన్ని పెంచుతుంది. కొత్త విషయాలను తెలుసుకోవడానికి మెదడును ఉత్తేజ పరుస్తుంది. పగటిపూట నిద్రపోవడం శక్తి స్థాయిలను పెంచుతుంది. రోజంతా పని చేస్తున్నప్పుడు అస్సలు అలసట అనిపించదు. వ్యాధి నిరోధకశక్తి కూడా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. రోజుకు 20 నుంచి 30 నిమిషాల పాటు నిద్రించడానికి చాలా మంది ఇష్టపడరు. ఇంతకంటే ఎక్కువసేపు నిద్రపోతే నిద్ర లేవగానే అలసటగా అనిపిస్తుంది. కొన్ని నిమిషాల పగటి నిద్ర గుండెకు కూడా మేలు చేస్తుంది.

సరైన సమయంలో కొద్దిపాటి నిద్ర వెంటనే మెదడు మీద ప్రభావం చూపిస్తుంది. ఈ విష యాన్ని చాలా పరిశోధనల్లో నిర్ధారించారు. ఆరో గ్యంగా ఉన్నవారు ఒక క్రమంలో నిద్రపోతూ ఉంటే వాళ్ల మీద పరిశోధనలు జరిగాయి. కొంతసేపు పడుకున్న వారిలో వారు పరిస్థితులకు ప్రతిచర్య చూపించే తీరు, చురుకుదనం, జ్ఞాపకశక్తి లాంటి అంశా లలో మంచి ప్రభావాలు కనిపించాయి. నిద్ర పోయి లేచిన తర్వాత సృజనాత్మకత కూడా పెరుగుతుంది. అంటే కొత్త అంశాలను ఊహించడం కూడా బాగా జరుగుతుంది. ఈ అంశం ఇటీవల పరిశోధనల్లో గమనించారు. పరిశోధనకు కూర్చున్న వారికి కొన్ని లెక్కలు ఇచ్చి చేయమన్నారు. ఆ లెక్కల్లో కొన్నింటికి సులభ మార్గాలు ఉన్నాయి. వాటి గురించి మాత్రం వాలంటీర్లకు చెప్పలేదు. ప్రశ్న ఇచ్చిన తర్వాత కాసేపు పడుకుంటే మాకేమీ అభ్యంతరం లేదు అన్నారు పరిశోధకులు. కొద్దిసేపు కునికిన వారు కూడా ఆ లెక్కలను సులభంగా సాల్వ్‌ చేయగలిగారు.వారికి స్వల్ప మార్గాలు చటుక్కున తోచాయి. అదే ఎక్కువ సేపు నిద్ర పోయిన వారిలో మాత్రం ఇటువంటి చురుకు దనం కనిపించలేదు. అంటే మెదడులో ఎక్కడో విరామం కలిగే అవకాశం గల స్థానం ఉందని, దానివల్ల యురేకా అనుభవం కలుగుతుందని పరిశోధకులు భావిస్తున్నారు.

నిద్ర సరిగా రానివారూ, కావలసినంత నిద్ర పోలేని వారు కూడా కొద్దిసేపు పడుకున్నందుకు మంచి ప్రభావాలు ఉంటాయి అంటు న్నారు. షిఫ్ట్‌లలో పనిచేసేవారూ, చిన్న శిశు వులతో బతికే తల్లితండ్రులూ, రాత్రిపూట సరిగా నిద్ర పట్టని పెద్ద వయసు వారూ చిన్న కునుకు వల్ల లాభం పొందినట్టు గమనించారు. రాత్రి షిఫ్ట్‌లో పని చేస్తున్న వాళ్లు షిఫ్ట్‌ మధ్యలో కొద్ది సేపు పడుకుంటే తప్పకుండా నిద్ర మత్తు తగ్గుతుంది. అసలు నిద్ర వస్తున్న భావమే కలు గదు. కొద్దిసేపు పడుకుని లేచిన తరువాత త్వర లోనే పరిస్థితి మారిపోతుంది. వారిలో చురుకు దనం కనిపిస్తుంది.

మధ్యాహ్నం కాసేపు నిద్రపోవడం వల్ల మెదడుకు విశ్రాంతి దొరుకుతుంది. ఆఫీస్‌లో పని ఒత్తిడి ఎక్కువగా ఉండేవారు భోజన విరామంలో చిన్నగా కునుకు తీయడం మంచిది. ఓ 15 – 20 నిమిషాల నిద్ర మెదడు ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది. పని ఒత్తిడి తగ్గుతుంది. శారీరకంగా, మానసికంగా కొత్త ఉత్సాహం వస్తుంది. పనిలో నాణ్యతతోపాటు ఉత్పాదకత కూడా పెరుగుతుంది. పగటి నిద్ర జ్ఞాపకశక్తినీ పెంచుతుంది. ముఖ్యంగా విద్యార్థులు మధ్యాహ్నం పూట ఓ 15 – 20 నిమిషాలు పడుకుంటే.. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. సృజనాత్మక ఆలోచనలూ పెరుగుతాయని అంటున్నారు. మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కడుపుబ్బరం, మలబద్ధకం, గ్యాస్ట్రిక్‌ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మధ్యాహ్నం నిద్ర వల్ల హార్మోన్ల అసమతుల్యత దూరం అవుతుంది. దాంతో.. థైరాయిడ్‌, పీసీఓఎస్‌, మధుమేహం, స్థూలకాయం.. వంటి దీర్ఘకాలిక సమస్యలు అదుపులో ఉంటాయి.

Latest Articles

‘కాలమేగా కరిగింది’ ట్రైలర్ చూశారా?

వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "కాలమేగా కరిగింది". ఈ సినిమాను శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్