Smita Sabharwal: కామారెడ్డి జిల్లాలో సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితాసబర్వాల్ టూర్ లో ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ శ్వేతా మహంతితో కలిసి భిక్కనూరు PHCలో గర్భిణీలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను ఆమె పంపిణీ చేశారు. ఈ క్రమంలో స్మిత(Smita Sabharwal) మాట్లాడుతుండగా.. బీఎస్పీ నాయకుడు శ్రీధర్ రెడ్డి అడ్డుపడ్డారు. జిల్లా కేంద్రంలో నార్మల్ డెలివరీలకు సౌకర్యాలు లేక పేద గర్భిణీలు ప్రైవేట్ హాస్పిటల్స్ కు పోవాల్సి వస్తుందని మొరపెట్టుకున్నాడు. దీంతో శ్రీధర్ రెడ్డిని పోలీసులు సభ బయటకు తీసుకెళ్లారు. నిజాలు మాట్లాడుతుంటే ఎందుకు అరెస్ట్ చేస్తారంటూ పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి ఓ 20 నిమిషాల పాటు సభ మొత్తం రసాభాసగా మారింది.
Read Also: