35.2 C
Hyderabad
Monday, May 11, 2026
spot_img

ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడం పక్కా..

స్వతంత్ర వెబ్ డెస్క్: సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటించిన చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. చిన్న సినిమాగా మొదలైన ఈ సినిమాను రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ లాంటి పెద్ద సంస్థ రిలీజ్ చేయబోతుండడం గమనార్హం. మైక్ మూవీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించారు. ఇక బ్రహ్మాజీ, సప్తగిరి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్‌ను హీరో సత్య దేవ్ విడుదల చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో సత్యదేవ్ మాట్లాడుతూ.. ‘స్లమ్ డాగ్ హజ్బెండ్ కాన్సెప్ట్ నాకు ముందే తెలుసన్న ఆయన జ్యోతిలక్ష్మి టైంలోనే విన్నానని, పూరి దగ్గర మేం ఉన్న సమయంలో ఈ కథ తెలుసు కానీ ఇంత ఎంటర్టైనర్‌గా ఉంటుందని అనుకోలేదని అన్నారు. ఇక బ్రహ్మాజీ మాట్లాడుతూ నా కొడుకు హీరోగా ఎదిగినందుకు సంతోషంగా ఉందని, కానీ ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని అన్నారు. నా కొడుక్కి సపరేట్‌గా నేనేమీ సలహాలు ఇవ్వలేదు, ఈ తరంలో హీరోలు అందరూ సహజంగానే నటిస్తున్నారని అన్నారు. ముందుగా ఈ సినిమాలో ఓ పాత్ర కోసం నన్ను అప్రోచ్ అయ్యారని, తరువాత హీరోగా మా అబ్బాయిని తీసుకున్నారని అన్నారు.

డైరెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ.. ‘హీరోయిన్ పాత్ర కోసం చాలా మందిని ఆడిషన్స్ చేశాను. పక్కింటి అమ్మాయిలా ప్రణవి బాగా సెట్ అవుతుందని ఆమెను హీరోయిన్‌గా తీసుకున్నాం. ఈ చిత్రంలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ ఉండదు. డాగ్‌కు మెయిల్ వాయిస్ పెట్టాం. కానీ అందులోనూ ఓ ట్విస్ట్ ఉంటుంది. పూరి జగన్నాథ్ సర్ దగ్గర నేను అసిస్టెంట్‌గా పని చేశాను. ఆయన పెట్ లవర్. మనుషులకంటే జంతువులే విధేయంగా ఉంటాయి. ఐశ్వర్య రాయ్ చెట్టుని పెళ్లి చేసుకుంది. ఆ రెండు పాయింట్లను అల్లుకుని ఈ కథను రాసుకున్నాను’ అని అన్నారు.

 

Latest Articles

వంట నూనె వాడకాన్ని తగ్గించుకోవాలని ప్రధాని ఎందుకు కోరారు? దానికి ప్రత్యామ్నాయం ఏమిటి?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రజలకు చేసిన ఒక కీలక పిలుపు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం కొనుగోళ్లు, ఇంధన వినియోగాన్ని తగ్గించాలి, విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించిన మోదీ.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్