కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడు కాంగ్రెస్ నేత గంగారెడ్డి హత్యతో జగిత్యాలలో ఉద్రిక్తత నెలకొంది.. హత్యకు నిరసనగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రోడ్డుపై భైఠాయించారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ నేతలే హత్య చేయించారని జీవన్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ రాజ్యంలో కాంగ్రెస్ నేతలకే రక్షణ కరువైందని ఆరోపించారు. మీకూ, కాంగ్రెస్‌కో దండం అంటూ విప్ అడ్లూరి లక్ష్మణ్‌తో ఘాటుగా అన్నారు. తమను మానసికంగా వేధించినా భరించామని జీవన్ రెడ్డి అన్నారు.