కాంగ్రెస్ పార్టీ పేరుకే లౌకికవాదం కానీ.. మతోన్మాదులను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. కాంగ్రెస్ హాయాంలో హైదరాబాద్‌లో అనేక సందర్భాల్లో బాంబులు పేలాయని,. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. కేంద్రంలో మోదీ సర్కార్ వచ్చాక ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతోందని ఈటల అన్నారు. సికింద్రాబాద్‌లో ప్రశాంత వాతావరణంలో ర్యాలీ నిర్వహించామని చెప్పారు. అయితే, బీజేపీ కార్యకర్తల ముసుగులో కొందరు చేరి రాళ్లు, చెప్పులు విసిరారని తెలిపారు. కాషాయ పార్టీ ఎప్పుడూ ప్రజల రక్షణ, శాంతిని మాత్రమే కాంక్షిస్తుందన్నారు. ప్రతీకారం అనేది తమ పార్టీలో ఉండదని ఈటల చెప్పారు.