24.1 C
Hyderabad
Tuesday, July 1, 2025
spot_img

సామాన్యుడి పక్షాన ‘స్వతంత్ర’ దిగ్విజయ యాత్రలో భాగంగా రెండో వార్షికోత్సవం

   ఎంత పెద్ద దూరమైనా మొదలయ్యేది చిన్న అడుగుతోనే.! ఇదే రీతిలో తెలుగు వార్తా ప్రపంచంలో రెండేళ్ల కిందట బుడిబుడి అడుగులతో తన ప్రస్తానాన్ని ప్రారంభించిన స్వతంత్ర న్యూస్ ఛానల్ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా తన ప్రస్తానాన్ని సాగిస్తోంది. దినదిన ప్రవర్థమానంగా ఎదుగుతోంది. ఈ క్రమంలో ఎన్నో ఘనతలు.మరెన్నో మైలురాళ్లు చేరుకుంది. సమాజంలో వివిధ వర్గాల కోసం వినూత్నమైన కార్యక్ర మాలను అందిస్తూ ముందుకెళుతోంది.

   న్యూస్ ఛానల్ అంటే కేవలం వార్తలు ఇవ్వడమే కాదు అని అంతకు మించి అన్నట్లుగా అడుగులు వేస్తోంది. ఎప్పటి కప్పుడు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అంశాలతో కూడిన వార్తలను గంటగంటకూ ప్రసారం చేయడమే కాదు. ప్రాంతీయ వార్తలకు పెద్ద పీట వేస్తూ జిల్లా డైరీని అందిస్తోంది. కొందరు రాజకీ య నేతలు మాటలను తూటాల్లా ప్రయోగిస్తుంటారు. అలాంటి వాటిని ఎప్పటికప్పుడు మాట-తూటా ద్వారా అందించే ప్రయత్నం మొదటి నుంచీ చేస్తోంది. ఇక, రాష్ట్ర, దేశ వ్యాప్తంగా అలాగే అంతర్జా తీయంగా కొన్ని అంశాలు ఎంతో ప్రాధాన్యం కలిగినవి ఉంటాయి. వాటిపై మరింత విశ్లేషణ అందిస్తూ ఫోకస్‌ పేరుతో, ఇదండీ సంగతి పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది స్వతంత్ర.

  ఎన్నికల వేళ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు సంబంధించిన అంశాలతో మీ ఎమ్మెల్యే హిట్టా-ఫట్టా, ఎమ్మెల్యే జాతకం, రంగస్థలం ఇలా పలు ప్రోగ్రాంలను అందించడంలో ఎప్పుడూ ముందు ఉంటోంది స్వతంత్ర ఛానల్. కేవలం వార్తలే కాదు. టెక్నాలజీ ప్రపంచంలో విశేషాలను పరిచయం చేస్తూ టెక్నో టాక్స్ తీసుకొచ్చింది. సినిమాలు, మెట్రో విశేషాలను ఎప్పటికప్పుడు అందిస్తూ వీక్షకుల మనసు దోచుకుం టోంది. ఇక, సీటీమార్ పేరుతో సమకాలీన అంశాలను తనదైన పద్దతిలో ప్రజెంట్ చేస్తూ ముందుకు సాగుతోంది. ఇక, మనిషికి విజ్ఞానం, వినోదం ఎంత ముఖ్యమో భక్తి కూడా అంతే. అది గమనించిన స్వతంత్ర స్థలపురాణం పేరుతో ఆయా ప్రాంతాల్లోని దేవాలయాలు, ఆచార వ్యవహారాలను పరిచయం చేస్తోంది స్వతంత్ర. వైద్య సలహాలు కోరుకునే వారి కోసం ఆస్పత్రికి వెళ్లే పని లేకుండా డాక్టర్ల సలహాలను డాక్టర్ స్వతంత్ర పేరుతో అందిస్తోంది మీ స్వతంత్ర న్యూస్. ఇలా చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఎప్పటి కప్పుడు వీక్షకుల అభిరుచికి తగినట్లుగా కార్యక్రమాలను ప్రసారం చేస్తూ రెండేళ్ల ప్రస్తా నాన్ని పూర్తి చేసి మూడో ఏట అడుగుపెడుతోంది స్వతంత్ర. ఈ సందర్భంగా మరోసారి మీ అందరి అభిమానం మాపై ఇలాగే ఉంటుందని ఆశిస్తోంది స్వతంత్ర.

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్