వరంగల్ జిల్లాలో గుడుంబా స్థావరాలపై ఉక్కుపాదం మోపారు పోలీసులు. ఏకకాలంలో మరిపెడ, సీరోలు, డోర్నకల్‌లో దాడులు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా మరిపెడ మండలం గాలివారి గూడెంలో500 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి, 50 లీటర్ల గుడంబాను సీజ్ చేశారు. ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అలాగే సీరోలు మండలం పలుకుబోడు తండాలో 10లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకొని 200 లీటర్ల గుడుంబా పానకం ధ్వంసం చేశారు. అదేవిధంగా డోర్నకల్ మండలం చాప్ల తండాలో 16లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు.


