37.2 C
Hyderabad
Monday, May 4, 2026
spot_img

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. మార్చి 3 నోటిఫికేషన్‌ విడుదల కానుంది. మార్చి 20 న పోలింగ్ నిర్వహించి.. అదే రోజు కౌంటింగ్ జరిపి తుది ఫలితాలు విడుదల చేస్తారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ రిలీజ్‌ చేసింది. ఏపీ, తెలంగాణలో ఐదుగురు చొప్పున మొత్తం 10 మంది పదవీకాలం ముగియనుంది.

మార్చి 29 నాటికి ఏపీలో యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, పి.అశోక్‌బాబు, తిరుమలనాయుడు, దువ్వారపు రామారావు పదవీకాలం ముగియనుంది. తెలంగాణలో పదవీకాలం ముగిసే వారిలో మహమూద్‌ అలీ, సత్యవతి రాథోడ్‌, శేరి సుభాష్‌రెడ్డి, ఎగ్గె మల్లేశం, మీర్జా రియాజుల్‌ హాసన్‌ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది.

మార్చి 3న ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ కానుంది. మార్చి 10న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. అలాగే మార్చి 11న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు తేదీ మార్చి 13. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ మార్చి 20 న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. అదే రోజు పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లు లెక్కిస్తారు.

Latest Articles

బెంగాల్‌లో బీజేపీ పాగా.. దీదీ కోటకు బీటలు.. అందుకేనా?

పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తృణమూల్ కాంగ్రెస్‌కు షాకిచ్చాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు మించి బీజేపీ అఖండ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఈ ఫలితాలతో రాష్ట్రంలో బీజేపీ కొత్త రాజకీయ శకాన్ని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్