పార్లమెంట్ ఎన్నికల వేళ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి టెలికాన్ఫరెన్స్ వాయిస్ రికార్డ్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. బీజేపీ పుంజుకుంటుందని.. బీఆర్‌ఎస్ పరిస్థితి అర్థంకావడం లేదని.. ఎన్నికల్లో పోటీ చేసేందుకు భయపడుతున్నా రంటూ సైదిరెడ్డి చేసిన సంచనలన వ్యాఖ్యలు తెలంగాణ పాలిటిక్స్‌లో మరింత హీట్‌ను పెంచాయి.
హుజూర్‌నగర్ బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే ఇటీవలే కారు దిగి.. కమలం తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా తన అనుచర బలగానికి నచ్చజెప్పే ప్రయత్నంలో భాగంగా టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మోదీ పాలనను ఆకాశానికెత్తేస్తూ నే.. బీఆర్ఎస్ పరిస్థితి అర్థం కావడలేదని.. లోకసభ ఎన్నకల బరిలో నిలిచేందుకు గులాబీ నేతలు భయపడుతున్నా రని అన్నారు. రంజిత్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డిలే వెనకడుగు వేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా సీఎం రేవంత్‌రెడ్డిని దింపాలని కాంగ్రెస్ భావిస్తోందని.. అందుకు బీఆర్‌ఎస్ నేతలే మద్దతు ఇస్తారని,.. ఇలాంటి కుట్ర రాజకీయాలు అవసరమా అంటూ తన అనుచరులను బుజ్జగించే ప్రయత్నం చేశారు సైదిరెడ్డి.
ఇక తాను కాషాయం కండువా కప్పుకోవడం గురించి సర్ది చెబుతూ క్షమాపణ కోరారు సైదిరెడ్డి. బీజేపీ ముఖ్య నేతల పిలుపుతోనే ఢిల్లీ వెళ్లానని, ఆ తర్వాత అక్కడున్న పెద్దలు ఫోర్స్ చేయడంతోపాటు.. పార్లమెంట్ టికెట్ ఇస్తామని హమీ ఇవ్వడంతోనే కమలం కండువా కప్పుకున్నానని కార్యకర్తలకు వివరించారు. నేను ఎవరితో చెప్పలేదు.. కార్యకర్తలతో మాట్లాడాలని చెప్పినా వారు వినిపించుకోలేదు. ఇప్పుడు కండువా కప్పుకోకపోతే తెలంగాణలో బీజేపీ పరువు పోతందని ఒత్తిడి చేశారు. ఎలాగూ మీరంతా నా వెంటే ఉంటారు, అర్థం చేసుకుంటారన్న నమ్మకంతోనే పార్టీ మారాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు సైదిరెడ్డి.
అలాగే నేను బీఆర్‌ఎస్‌లో చేరినప్పుడు పార్టీ పరిస్థితి ఏంటో మీకు తెలుసు. ఒక్క సర్పంచ్ కూడా లేడు. నేను వచ్చాకే 120 మంది సర్పంచ్‌లు, 17 పీఏసీఎస్‌లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు గెలిపించుకు న్నాం. ఇంత చేసినా యువతకు ఏమీ చేయలేదనే బాధ ఉంది. ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీనే మళ్లీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు యూత్‌కు మనం స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంలు తీసుకురావచ్చని ఆలోచించిన. ఇన్నాళ్ల చరిత్రలో ఇంత క్లీన్ ఇమేజ్ ఉన్న మోదీలాంటి నాయకుడు లేడు. ఒక్క స్కాం లేదు. ఆయనకు కుటుంబం లేదు. దేశమే ఆయనకు కుటుంబం. ఆయన సపోర్టు ఉంటే మనకు మంచిదని ఆలోచించిన. వాళ్లు నన్ను కావాలని కోరుకోవడం నాకు మంచిదవుతుందను కున్న. అందుకే బీజేపీలో చేరానని కార్యకర్తలకు టెలికాన్ఫరెన్స్ ద్వారా వివరించారు. అంతే కాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ హావా చాటుతుందని జోష్యం చెప్పారు సైదిరెడ్డి. 10 నుంచి 12 సీట్లు బీజేపీకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మారకపోతే ఆగమైతమని ఆలోచించిన. మీకు నా మీద కోపం లేదని నేను అనను, కోపం ఉన్నా నాకు సపోర్టు చేస్తరు.. చేయండి. మీ బలం ఉంటదని ఆలోచించిన. అందరూ నా వెంట వస్తారని ఆశిస్తున్న. మీ బలం ఉంటదనే నేను పోయిన.. మీరు లేకుంటే నాకు విలువ లేదు,.. నేను లేను. రెండు మూడు రోజుల్లో హుజూర్‌నగర్‌కు వచ్చి మీటింగ్ పెడ్తా, నావెంటే ఉండాలని సైదిరెడ్డి తన అనుచరులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. అయితే,.. ఇప్పుడా వ్యాఖ్యలే రాష్ట్ర రాజకీ యా ల్లో హాట్ టాపిక్‌గా మారాయి.