23.2 C
Hyderabad
Thursday, December 5, 2024
spot_img

మహిళల గొప్పతనాన్ని చాటేలా సాయిధరమ్ తేజ్ ‘సత్య’

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ సినిమా చేయడమే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. తన సంపాదనలో కొంత ఛారిటీ కూడా చేస్తుంటారు. విజయవాడలోని వృద్ధాశ్రమంతో పాటు తెలంగాణలోని ఓ ఊళ్లో 100 మందికి పైగా ఉన్న స్కూల్లోని పిల్లల బాధ్యత కూడా తీసుకున్నారు.

అలాగే తేజ్‌కు మహిళలపై అమితమైన గౌరవం ఉంది. ఇప్పటివరకు ఆయన నటించిన సినిమాల్లో అది స్పష్టంగా కనిపిస్తుంది. ఇటీవల విరూపాక్ష, బ్రో వంటి వరుస విజయాలు అందుకున్నారు తేజ్. తాజాగా మహిళల గొప్పతనాన్ని చాటే ఓ షార్ట్ ఫిలింలో నటించారు. ఆడవారు లేకుంటే ప్రపంచంలో ఎవరికీ మనుగడ ఉండదు అనే దాన్ని బలంగా ఈ చిత్రంతో తీసుకువెళ్ళాలనే ఉద్దేశ్యంతో షెడ్యూల్ ఎంత బిజిగా ఉన్నా కూడా సత్య అనే లఘు సినిమాలో నటించారు. సీనియర్ నటుడు నరేష్ కుమారుడు నవీన్ విజయ్ కృష్ణ ఈ షార్ట్ ఫిలింకి దర్శకత్వం వహించారు. కలర్స్ స్వాతి ఫిమేల్ లీడ్‌గా సాయి ధరమ్ తేజ్‌కి జంటగా నటించింది. దిల్ రాజు ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై హ‌ర్షిత్, హ‌న్షిత దీన్ని నిర్మించారు. రీసెంట్‌గా ఈ షార్ట్ ఫీచర్ నుంచి సోల్ ఆఫ్ స‌త్య అనే మ్యూజిక‌ల్ షార్ట్‌ను రామ్ చ‌ర‌ణ్ విడుద‌ల చేసి టీమ్‌ను అభినందించారు

మ‌న కోసం దేశ స‌రిహ‌ద్దుల్లో ప్రాణాల‌ను అర్పిస్తున్న సైనికుల‌కు, వారి వెనుకున్న ఎందరో త‌ల్లులు, భార్యలు, అక్కలు, చెల్లెళ్లకు నివాళిగా.. మంచి కాన్సెప్ట్‌తో ఈ షార్ట్ ఫిల్మ్‌ను రూపొందించారు. ఇందులో సోల్జర్‌గా సాయిధరమ్ తేజ్ కనిపిస్తారు. ఆయన భార్యగా కలర్స్ స్వాతి నటించింది. భార్య భర్తల మధ్య ఉండే ప్రేమానుబంధాన్ని ఈ వీడియోలో చక్కగా చూపించారు. ఓవైపు భార్యను ప్రేమిస్తూనే మరోవైపు దేశాన్ని కూడా ప్రేమిస్తూ దేశం కోసం ప్రాణాలర్పించే సోల్జర్ పాత్రలో సాయిధరమ్ తేజ్ నటించిన తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. దేశాన్ని ప్రేమిస్తూ దేశం కోసం పోరాడే గొప్ప యోధులను కని, పెంచడమే కాకుండా.. దేశం కోసం తమ ప్రేమను త్యాగం చేసిన గొప్ప మహిళలందరికీ ఈ ఫీల్ గుడ్ ఎమోషనల్ సాంగ్‌ను అంకితం ఇచ్చారు. సింగర్ శృతి రంజని ఈ పాటను కంపోజ్ చేయడంతో పాటు తానే స్వయంగా లిరిక్స్ రాసి పాట పాడారు.

Latest Articles

సీఎం చంద్రబాబుపై జగన్ సంచలన ఆరోపణలు

ఏపీలో అమల్లోకి వచ్చిన కొత్త మద్యం విధానంపై తొలిసారి వైసీపీ అధినేత జగన్ స్పందించారు. ఈనేపథ్యంలోనే ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నడుపుతున్న బెల్టు షాపులు ఎత్తివేశారని అన్నారు. మొత్తం షాపులన్నింటినీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్