వనపర్తిలో సీఎం రేవంత్‌రెడ్డి సుమారు 721 కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపనలు చేస్తారని ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి చెప్పారు. మార్చి రెండవ తేదీన వనపర్తి నియోజకవర్గంలో సీఎం పర్యటిస్తారన్నారు. రేవంత్‌రెడ్డి సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే మెగారెడ్డి, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించారు. 257 కోట్ల రూపాయలతో 530 పడకల ఆసుపత్రి నిర్మాణానికి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారన్నారు.
తాను చదువుకున్న పాఠశాల పునరుద్ధరణకు 60 కోట్ల రూపాయలతో రేవంత్‌రెడ్డి పునరుద్ధరణ పనులు, 81 కోట్ల రూపాయలతో కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని మెగారెడ్డి చెప్పారు. వనపర్తి నియోజకవర్గానికి రేవంత్‌రెడ్డి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని మెగారెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లురవి తదితరులు పాల్గొన్నారు.