మూసీ నిర్వాసితులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బఫర్ జోన్లో ఉన్న వాళ్లకు ప్రత్యామ్నాయం చూపిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. అక్కడ ఉన్న ప్రజలను ఏరకంగా ఆదుకోవాలో ప్రభుత్వానికి సూచన చేయాలని చెప్పారు. రేస్ కోర్స్‌ను నగర శివార్లకు తరలిస్తే మలక్‌పేట్‌లో 150 ఎకరాలు అందుబాటులోకి వస్తామన్నాని తెలిపారు. అలాగే అంబర్‌పేట్‌లో ఉన్న పోలీస్ అకాడమీని సిటీ బయటకు తరలిస్తే మరో 200 ఎకరాలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ ప్రభుత్వ స్థలాల్లో పేదలకు ఇళ్లు కట్టించవచ్చని తెలిపారు. ఇళ్లు కోల్పోయిన వారికి ఎలా న్యాయం చేయాలనే దానిపై ఓ కమిటీ వేస్తామని అందులో కేటీఆర్, హరీశ్, ఈటల ఉండేలా చూస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.