జానీ మాస్టర్ బెయిల్ రద్దు కోరనున్నారు పోలీసులు. జానీ మాస్టర్‌కు నేషనల్ అవార్డు నిలిపివేతతో.. మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని పోలీసులు కోరనున్నారు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు జాతీయ అవార్డును రద్దు చేస్తున్నట్లు కమిటీ ప్రకటించింది. ఆయన పై పోక్సో కేసు నమోదు కావడంతో నేషనల్ అవార్డును రద్దు చేస్తూ కమిటీ నిర్ణయం తీసుకుంది. అయితే.. అవార్డు రద్దు కావడంతో దీని ప్రభావం ఆయన బెయిల్‌పై పడే అవకాశం ఉంది. అవార్డు తీసుకునే కారణంతోనే జానీమాస్టర్‌కు కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అవార్డు రద్దు కావడంతో మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని పోలీసులు కోరనున్నారు.