హైదరాబాద్ , సెప్టెంబర్ 29: రిలయన్స్ రిటైల్‌కు చెందిన ఓమ్నీ ఛానల్ బ్యూటీ రిటైల్ ప్లాట్ ఫామ్ ‘టీరా’ తన తొలి స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఈ సంవత్సరం ప్రారంభించిన జియో వరల్డ్ డ్రైవ్, ఇన్ఫినిటీ మాల్ మలాడ్ వద్ద ముంబైలో తన స్టోర్లు విజయవంతం కావడంతో.. ఈ బ్రాండ్ కొత్తగా హైదరాబాద్ స్టోర్‌ను నగరంలో సందడిగా ఉండే శరత్ సిటీ మాల్‌లో ప్రారంభించింది. వైబ్రెంట్ సిటీ అయిన హైదరాబాద్‌కు ఉత్తమ సౌందర్య ఉత్పత్తులు, అనుభవాలను తీసుకురావాలనే నిబద్ధతకు ఈ స్టోర్ ఒక నిదర్శనం. ‘టీరా’ కొత్త తరం కస్టమర్ల కోసం అంతర్జాతీయ, స్వదేశీ బ్యూటీ బ్రాండ్ల మంచి కలయికను అందిస్తుంది. ఎలివేటెడ్ షాపింగ్ అనుభవాన్ని కస్టమర్లకు అందిస్తుంది.
రిటైల్ స్టోర్స్‌లో ఫ్రాగ్రెన్స్ ఫైండర్ ఒకటి కూడా ఉంది. రీటైల్ వాతావరణంలో ఇలాంటిది ఉండటం ఇదే మొట్టమొదటి సారి. కస్టమర్లు తమకు నచ్చిన పెర్‌ఫ్యూంలను కేటగిరైజ్ చేసిన సువాసనల ఆధారంగా ఎంపిక చేసుకోవడానికి దీనివల్ల వీలు కుదురుతుంది. ‘టీరా’ హైదరాబాద్ స్టోర్ బ్యూటీ రిటైల్ అనుభవాన్ని విప్లవాత్మకంగా మార్చాలని కోరుకుంటుంది. వినియోగదారులు వారి ప్రత్యేకమైన సౌందర్య ప్రాధాన్యతలను అన్వేషించడానికి, స్వీకరించడానికి ఇంటరాక్టివ్, సాంకేతిక-ఆధారిత వాతావరణాన్ని ఇది అందిస్తుంది. ‘టీరా’ నిరంతరం బ్యూటీ రిటైల్ ల్యాండ్ స్కేప్ ను పునర్నిర్మిస్తున్నందున, ఇది అందం పట్ల ఆసక్తి, ఉత్సాహం ఉన్నవారందరికీ సమ్మిళిత, సాధికారిక సౌందర్య ప్రయాణానికి మార్గం సుగమం చేస్తుంది.
కరీనా కపూర్ ఖాన్, కియారా అద్వానీ, సుహానా ఖాన్‌లతో ‘ఫర్ ఎవ్రీ యు’ పేరుతో ‘టీరా’ ఇటీవల హై ఇంపాక్ట్ 360 డిగ్రీల క్యాంపెయిన్‌ను ఆవిష్కరించింది. మరింత సమాచారం కోసం, ‘టీరా’ అందించే వైవిధ్యమైన సౌందర్య ఆఫర్లను తెలుసుకోవడానికి, హైదరాబాద్‌లోని శరత్ సిటీ మాల్(ఏఎంబీ మాల్)లో కొత్తగా ప్రారంభించిన స్టోర్‌ను సందర్శించండి.