39.2 C
Hyderabad
Saturday, May 2, 2026
spot_img

అసెంబ్లీని వాయిదా వేయడం పట్ల.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఆగ్రహం

అసెంబ్లీని వాయిదా వేయడం పట్ల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని వాయిదా వేయడం పట్ల మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి , ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ తప్పుపట్టారు. అసెంబ్లీని ఒక్క నిమిషంలోనే వాయిదా వేయడం చరిత్ర లేదని, దీనిని శాసనసభా పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కీలకమైన అంశాలు అసెంబ్లీలో చర్చకు పెట్టినప్పుడు ముందుగానే మంత్రివర్గ సమావేశం పెట్టుకుంటారని అన్నారు. అలా కాకుండా అసెంబ్లీ సమావేశం ఉందనగా గంట ముందు మంత్రి వర్గ సమావేశం పెట్టుకోవడం శోచనీయమని అన్నారు. బీసీ, ఎస్సీ వర్గీకరణ అంశాలు రెండు కూడా ఒకేరోజు పెట్టుకోవాలని ఆత్రుత ఎందుకని వేముల ప్రశాంత్ ప్రశ్నించారు.

రాష్ట్రంలోని ముఖ్యమైన అంశాలపై నిర్వహిస్తున్న అసెంబ్లీ సమావేశాన్ని ఒక్క నిమిషంలోనే వాయిదా వేయడం బాధ్యతారాహిత్యమని మాజీ మంత్రి, BRS ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆరోపించారు. సమావేశాన్ని వాయిదా వేసి శాసనసభ రూల్స్, ప్రొసిజర్స్ తుంగలో తొక్కారని ఆరోపించారు. కామారెడ్డి డిక్లరేషన్ యధాతథంగా అమలు చేయడం కోసం తెలంగాణ సమాజం ఎదురు చూస్తోందని చెప్పారు. ప్రాధాన్యత గల అంశాలపై నాలుగు రోజులు చర్చ లేకుండా ఒక్క రోజుల్లోనే ముగించడం ఏమిటని ప్రశ్నించారు. అన్యాయం జరిగితే బీసీల ఐక్యంతో ఇప్పుడు అతిపెద్ద ఉద్యమం మరోసారి రాబోతుందని అన్నారు.

కాంగ్రెస్‌ నిర్వహించిన సర్వేలో తమకు అనుమానాలు ఉన్నాయని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వాటిని నివృత్తి కావాలంటే ప్రభుత్వం నాలుగు రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలన్నారు. కీలక అంశామైన బీసీ, ఎస్సీ కుల గణనపై చర్చలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

Latest Articles

ట్రంప్‌ ప్రజాదరణ కోల్పోతున్నారా?.. పని తీరుపై ప్యూ సర్వే ఏం చెబుతోంది?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పనితీరు, చురుకుదనం , ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం వంటి అంశాలపై క్రమంగా ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్