Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవెంకటేశ్వర దేవస్థానంలో భక్తుల రద్దీ తగ్గింది. క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం కలుగుతోంది. తాజాగా, స్వామి వారి దర్శన, ఆదాయ వివరాలను టీటీడీ వెల్లడించింది. ఆదివారం శ్రీనివాసుడిని 76,201 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,587 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా, తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.98 కోట్లు వచ్చినట్లు తిరుములతిరుపతి దేవస్థానం వెల్లడించింది.